జగన్ సర్కార్‌పై హీరో నాని అసహనం..

దిశ, ఏపీ బ్యూరో : ఏపీ ప్రభుత్వంపై నేచురల్ స్టార్ నాని అసహనం వ్యక్తం చేశారు. సినిమా టికెట్ ధరలను తగ్గించడాన్ని తప్పుబట్టారు. ‘శ్యామ్ సింగరాయ్’ చిత్రబృందం గురువారం నిర్వహించిన మీడియా సమావేశంలో పాల్గొన్న హీరో నాని సినిమా టికెట్ల ధరలను ఏపీ ప్రభుత్వం తగ్గించిందని, ఇది సరైన నిర్ణయం కాదని వ్యాఖ్యానించారు. టికెట్ ధరలను తగ్గించడం ద్వారా ప్రేక్షకులను ప్రభుత్వం అవమానించినట్లైందని అభిప్రాయపడ్డారు. రాష్ట్రంలో ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే సినిమా థియేటర్ల కంటే పక్కనున్న కిరాణా […]

Update: 2021-12-23 04:04 GMT

దిశ, ఏపీ బ్యూరో : ఏపీ ప్రభుత్వంపై నేచురల్ స్టార్ నాని అసహనం వ్యక్తం చేశారు. సినిమా టికెట్ ధరలను తగ్గించడాన్ని తప్పుబట్టారు. ‘శ్యామ్ సింగరాయ్’ చిత్రబృందం గురువారం నిర్వహించిన మీడియా సమావేశంలో పాల్గొన్న హీరో నాని సినిమా టికెట్ల ధరలను ఏపీ ప్రభుత్వం తగ్గించిందని, ఇది సరైన నిర్ణయం కాదని వ్యాఖ్యానించారు. టికెట్ ధరలను తగ్గించడం ద్వారా ప్రేక్షకులను ప్రభుత్వం అవమానించినట్లైందని అభిప్రాయపడ్డారు. రాష్ట్రంలో ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే సినిమా థియేటర్ల కంటే పక్కనున్న కిరాణా షాపులకు ఎక్కువ కలెక్షన్లు ఉన్నాయంటూ సెటైర్లు వేశారు. టికెట్ ధర ఎంత ఉన్నా కొనుక్కునే శక్తి, సామర్థ్యం ప్రేక్షకుడికి ఉందని ఈ విషయాన్ని ప్రభుత్వం ఆలోచించాలంటూ నాని సూచించారు.

Tags:    

Similar News