మోడీకి దండం.. వైరల్ అవుతున్న ఫోటోలు..
దిశ, వెబ్‌డెస్క్: అనాటి నుండి ఈనాటి వరకు ఎన్ని రాజకీయ పార్టీలు అధికారంలోకి వచ్చినా.. ఎన్నికల హామీలను నేరవేర్చడంలో విఫలం అవుతూనే ఉన్నాయి. నల్లధనాన్ని నిర్మూళిస్తానని, భారత దేశ ఆర్థిక వ్యవస్థ ను బాగుపరుస్తానని, అవినీతి నిర్మూళన, పేదవారికి సంక్షేమ పథకాలు ప్రవేశపెడుతానంటూ మోడీ చెప్పి ప్రధాని అయిన మోడీ కూడా విఫలమయ్యారనే విమర్శలు వినిపిస్తున్నాయి. దానికి కారణం కూడా లేకపోలేదు.. వాడకం తగ్గినా క్రూడాయిల్ ధర రోజురోజుకు పెరిపోవడమే. క్రూడాయిల్ ధర రూ. 40 ఉంటే […]
దిశ, వెబ్‌డెస్క్: అనాటి నుండి ఈనాటి వరకు ఎన్ని రాజకీయ పార్టీలు అధికారంలోకి వచ్చినా.. ఎన్నికల హామీలను నేరవేర్చడంలో విఫలం అవుతూనే ఉన్నాయి. నల్లధనాన్ని నిర్మూళిస్తానని, భారత దేశ ఆర్థిక వ్యవస్థ ను బాగుపరుస్తానని, అవినీతి నిర్మూళన, పేదవారికి సంక్షేమ పథకాలు ప్రవేశపెడుతానంటూ మోడీ చెప్పి ప్రధాని అయిన మోడీ కూడా విఫలమయ్యారనే విమర్శలు వినిపిస్తున్నాయి. దానికి కారణం కూడా లేకపోలేదు..
వాడకం తగ్గినా క్రూడాయిల్ ధర రోజురోజుకు పెరిపోవడమే. క్రూడాయిల్ ధర రూ. 40 ఉంటే కేంద్ర పన్ను దాదాపు రూ. 30కిపైగా, రాష్ట్ర ప్రభుత్వ పన్ను 27కు పైగా ఉంది. దీంతో సామాన్యుడి జేబుకు చిల్లు పడుతోంది. అంతేకాకుండా వంటనూనె సైతం అమాంతంగా పెరిగి సుమారు రూ.175 చేరుకొంది. కేంద్ర ప్రభుత్వం తీరుకు నిరసనగా పలువురు పెట్రోల్ బంక్‌లలో మోదీ ఫోటోకు దండం పెడుతూ దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో పెట్టడంతో అవి వైరల్‌గా మారాయి.