నమస్తే తెలంగాణకు ఈటల ఎఫెక్ట్.. పేపర్లు దగ్ధం

దిశ, చెన్నూర్: తెలంగాణ సీఎం కేసీఆర్, టీఆర్‌ఎస్ పార్టీ సొంత పత్రికగా పేరు పొందిన నమస్తే తెలంగాణకు మాజీ మంత్రి ఈటల రాజేందర్ ఎఫెక్ట్ తగలింది. నమస్తే తెలంగాణలో ఈటలకు వ్యతిరేకంగా వార్తలు రాయడం, ఈటలను కేబినెట్ నుంచి బర్తరఫ్ చేసిన దగ్గర నుంచి ఆయన అభిమానులు కేసీఆర్‌పై మండిపడుతున్నారు. పలుచోట్ల కేసీఆర్ చిత్రపటాలు దగ్ధం చేశారు. ఈ క్రమంలో తాజాగా  నమస్తే తెలంగాణ దినపత్రికకు ఈటల మద్దతురాలు షాక్ ఇచ్చారు. నమస్తే తెలంగాణ దినపత్రిక ప్రతులను […]

Update: 2021-06-10 00:56 GMT

దిశ, చెన్నూర్: తెలంగాణ సీఎం కేసీఆర్, టీఆర్‌ఎస్ పార్టీ సొంత పత్రికగా పేరు పొందిన నమస్తే తెలంగాణకు మాజీ మంత్రి ఈటల రాజేందర్ ఎఫెక్ట్ తగలింది. నమస్తే తెలంగాణలో ఈటలకు వ్యతిరేకంగా వార్తలు రాయడం, ఈటలను కేబినెట్ నుంచి బర్తరఫ్ చేసిన దగ్గర నుంచి ఆయన అభిమానులు కేసీఆర్‌పై మండిపడుతున్నారు. పలుచోట్ల కేసీఆర్ చిత్రపటాలు దగ్ధం చేశారు. ఈ క్రమంలో తాజాగా నమస్తే తెలంగాణ దినపత్రికకు ఈటల మద్దతురాలు షాక్ ఇచ్చారు.

నమస్తే తెలంగాణ దినపత్రిక ప్రతులను ఈటల మద్దతుదారులు దగ్ధం చేశారు. చెన్నూర్ మండలంలోని రాయిపేట గ్రామంలో నమస్తే తెలంగాణ పత్రిక ప్రతులను ఈటల రాజేందర్ మద్దతుదారులు దగ్ధం చేసి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. మాజీ మంత్రి ఈటల రాజేందర్ వ్యక్తిత్వాన్ని కించపరుస్తూ, ఫోటోలను మార్పింగ్ చేస్తూ అసత్య ఆరోపణలు చేస్తున్న సందర్భంగా నమస్తే తెలంగాణ పత్రికను దగ్ధం చేసినట్లు తెలిపారు. ఇలాగే పిచ్చి రాతలు రాస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు.

Tags:    

Similar News