నల్లమలలో యూరేనియం తవ్వకాలకు సన్నాహాలు?
దిశ, మహబూబ్ నగర్: ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోని నల్లమల అటవీ ప్రాంతంలో మరోసారి యురేనియం తవ్వకం కలకలం రేపుతోంది. నల్లమల అటవీ ప్రాంతంలో యురేనియం తవ్వకాలు చేపట్టొద్దని తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ తీర్మానం చేసినా అవేవి పట్టించుకోకుండా కేంద్ర ప్రభుత్వం, యురేనియం కార్పొరేషన్ మాత్రం ముందుకు సాగుతున్నట్టు తెలుస్తోంది. తాజాగా మంగళవారం నల్లమలలో బోర్ పాయింట్స్‌ను గుర్తించేందుకు కేంద్రం ఆదేశాలతో అటవీశాఖ అధికారులు పర్యటించారు. ఎలాంటి ఆందోళనలు చేపట్టకుండా ఉండేందుకు ముందస్తుగా యురేనియం వ్యతిరేక పోరాట […]
దిశ, మహబూబ్ నగర్: ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోని నల్లమల అటవీ ప్రాంతంలో మరోసారి యురేనియం తవ్వకం కలకలం రేపుతోంది. నల్లమల అటవీ ప్రాంతంలో యురేనియం తవ్వకాలు చేపట్టొద్దని తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ తీర్మానం చేసినా అవేవి పట్టించుకోకుండా కేంద్ర ప్రభుత్వం, యురేనియం కార్పొరేషన్ మాత్రం ముందుకు సాగుతున్నట్టు తెలుస్తోంది. తాజాగా మంగళవారం నల్లమలలో బోర్ పాయింట్స్‌ను గుర్తించేందుకు కేంద్రం ఆదేశాలతో అటవీశాఖ అధికారులు పర్యటించారు. ఎలాంటి ఆందోళనలు చేపట్టకుండా ఉండేందుకు ముందస్తుగా యురేనియం వ్యతిరేక పోరాట సమితి నాయకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
Tags: uranium digging, central govt, forest department, protester arrested