పారిశుధ్య పనులపై కలెక్టర్ అసహనం

దిశ, మునుగోడు: మునుగోడు మండల కేంద్రంలో నిర్మిస్తున్న రైతువేదిక భవన నిర్మాణాన్ని నల్లగొండ జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ సోమవారం పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ… రైతువేదిక నిర్మాణ పనుల్లో వేగం పెంచాలని అధికారులను ఆదేశించారు.సెప్టెంబర్ నెల వరకు రైతు వేదిక నిర్మాణం పూర్తిచేయాలని అధికారులను సూచించారు. మండల కేంద్రంలో జరుగుతున్న పారిశుధ్య పనులపై కలెక్టర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. పనుల్లో నిర్లక్ష్యం చేస్తే అధికారులపై చర్యలు తప్పవని హెచ్చరించారు. అనంతరం మండల పరిధిలోని […]

Update: 2020-08-24 11:14 GMT

దిశ, మునుగోడు: మునుగోడు మండల కేంద్రంలో నిర్మిస్తున్న రైతువేదిక భవన నిర్మాణాన్ని నల్లగొండ జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ సోమవారం పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ… రైతువేదిక నిర్మాణ పనుల్లో వేగం పెంచాలని అధికారులను ఆదేశించారు.సెప్టెంబర్ నెల వరకు రైతు వేదిక నిర్మాణం పూర్తిచేయాలని అధికారులను సూచించారు. మండల కేంద్రంలో జరుగుతున్న పారిశుధ్య పనులపై కలెక్టర్ అసంతృప్తి వ్యక్తం చేశారు.

పనుల్లో నిర్లక్ష్యం చేస్తే అధికారులపై చర్యలు తప్పవని హెచ్చరించారు. అనంతరం మండల పరిధిలోని గుడాపూర్, రావిగూడెం, సింగారం గ్రామాల్లో పల్లె ప్రకృతి వనాలు, స్మశాన వాటికల పనులను పరిశీలించారు. మండలంలో జరుగుతున్న అభివృద్ధి పనులు జిల్లాకు ఆదర్శంగా ఉన్నాయని అధికారులను, ప్రజాప్రతినిధులను అభినందించారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన అభివృద్ధి పనుల్లో అలసత్వం వహించొద్దని సూచించారు.

Tags:    

Similar News