ఓటీపీ షేర్ చేస్తే ఇదే పరిస్థితి

దిశ, స్పోర్ట్స్: బ్యాంకింగ్ మోసాలపై ఎంతో కాలంగా ప్రజలను నాగ్‌పూర్ పోలీసులు అప్రమత్తం చేస్తున్నారు. జోక్స్, మీమ్స్‌తో బ్యాంకింగ్ జాగ్రత్తలపై అవగాహన కల్పిస్తున్నారు. ఇతరులకు ఓటీపీని షేర్ చేయవద్దంటూ హెచ్చరిస్తున్నారు. ప్రస్తుతం ఐపీఎల్-13 సీజన్ జరుగుతున్నది. అభిమానులు క్రికెట్ ఫీవర్‌లో ఉన్నారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫొటోలను నాగ్‌పూర్ పోలీసులు మీమ్స్‌గా వాడుతున్నారు. భీతిల్లిన కోల్‌కతా నైట్‌రైడర్స్ బౌలర్ వరుణ్‌ చక్రవర్తి ఫొటోను మీమ్స్‌గా వినియోగించి ఎవరైనా ఓటీపీ షేర్ చేస్తే ఇలాంటి పరిస్థితే ఎదురవుతుందని పరోక్షంగా […]

Update: 2020-10-05 06:18 GMT

దిశ, స్పోర్ట్స్: బ్యాంకింగ్ మోసాలపై ఎంతో కాలంగా ప్రజలను నాగ్‌పూర్ పోలీసులు అప్రమత్తం చేస్తున్నారు. జోక్స్, మీమ్స్‌తో బ్యాంకింగ్ జాగ్రత్తలపై అవగాహన కల్పిస్తున్నారు. ఇతరులకు ఓటీపీని షేర్ చేయవద్దంటూ హెచ్చరిస్తున్నారు. ప్రస్తుతం ఐపీఎల్-13 సీజన్ జరుగుతున్నది. అభిమానులు క్రికెట్ ఫీవర్‌లో ఉన్నారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫొటోలను నాగ్‌పూర్ పోలీసులు మీమ్స్‌గా వాడుతున్నారు.

భీతిల్లిన కోల్‌కతా నైట్‌రైడర్స్ బౌలర్ వరుణ్‌ చక్రవర్తి ఫొటోను మీమ్స్‌గా వినియోగించి ఎవరైనా ఓటీపీ షేర్ చేస్తే ఇలాంటి పరిస్థితే ఎదురవుతుందని పరోక్షంగా హెచ్చరించారు. కోల్‌కతాతో జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ బ్యాట్స్‌మెన్ చెలరేగిపోయారు. 20 ఓవర్లలో 228 పరుగులు చేశారు. ఈ క్రమంలో బౌలర్ వరుణ్ చక్రవర్తి భారీగా పరుగులు సమర్పించుకున్నాడు. అతని బౌలింగ్‌లో బాదిన భారీ సిక్సర్‌కు రెండు కళ్లు పెద్దగా చేసి, రెండు చేతులతో జుట్టు పీకున్నాడు. ఈ ఫొటోనే నాగ్‌పూర్ పోలీసులు ‘ఓటీపీ’పై హెచ్చరిస్తూ షేర్ చేశారు.

Tags:    

Similar News