సాగర్ గేట్లు ఎత్తండి : కేసీఆర్ ఆదేశం

దిశ, నాగార్జున సాగ‌ర్ : నాగార్జున సాగ‌ర్ ఎడ‌మ కాలువ‌కు నీటిని విడుద‌ల చేయాలని సీఎం కేసీఆర్ ఆదేశించిన‌ట్టు విద్యుత్ శాఖ మంత్రి జ‌గ‌దీశ్ రెడ్డి తెలిపారు. ఎలిమినేటి మాధ‌వ‌రెడ్డి ప్రాజెక్టు (AMRP) నుంచి కూడా నీటి విడుద‌ల‌కు కేసీఆర్ ఆదేశించినట్టు పేర్కొన్నారు. ఆదివారం సాయంత్రం వరకు సాగ‌ర్ ప్రాజెక్టులో నీటిమట్టం పూర్తిస్థాయికి చేరుకునే అవకాశం ఉండటంతో క్రస్ట్‌ గేట్లు ఎత్తేందుకు అధికారులు సన్నద్ధమయ్యారు. సాయంత్రం ఆరు గంటలకు గేట్లను ఎత్తివేసి నీటిని దిగువకు విడుదల చేయనున్నట్టు […]

Update: 2021-08-01 03:38 GMT

దిశ, నాగార్జున సాగ‌ర్ : నాగార్జున సాగ‌ర్ ఎడ‌మ కాలువ‌కు నీటిని విడుద‌ల చేయాలని సీఎం కేసీఆర్ ఆదేశించిన‌ట్టు విద్యుత్ శాఖ మంత్రి జ‌గ‌దీశ్ రెడ్డి తెలిపారు. ఎలిమినేటి మాధ‌వ‌రెడ్డి ప్రాజెక్టు (AMRP) నుంచి కూడా నీటి విడుద‌ల‌కు కేసీఆర్ ఆదేశించినట్టు పేర్కొన్నారు.

ఆదివారం సాయంత్రం వరకు సాగ‌ర్ ప్రాజెక్టులో నీటిమట్టం పూర్తిస్థాయికి చేరుకునే అవకాశం ఉండటంతో క్రస్ట్‌ గేట్లు ఎత్తేందుకు అధికారులు సన్నద్ధమయ్యారు. సాయంత్రం ఆరు గంటలకు గేట్లను ఎత్తివేసి నీటిని దిగువకు విడుదల చేయనున్నట్టు ప్రాజెక్టు సీఈ శ్రీకాంతరావు తెలిపారు. ప్రస్తుతం ప్రాజెక్టుకు 4,80,222 క్యూసెక్కుల ప్రవాహం వస్తుండగా.. ప్రస్తుతం ఔట్‌ఫ్లో 37,743 క్యూసెక్కులుగా ఉన్నది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులకు గాను.. ప్రస్తుతం 579.20 అడుగులకు చేరింది. గరిష్ఠ నీటి నిల్వ సామర్థ్యం 312.0450 టీఎంసీలు. ప్రస్తుతం డ్యామ్‌లో 280.69 టీఎంసీల నీరు నిల్వ ఉన్నది.

Tags:    

Similar News