మరోసారి బయటపడ్డ ఆ జిల్లా ఆస్పత్రి వైద్యుల నిర్లక్ష్యం..

దిశ, నాగర్‌కర్నూల్: నాగర్ కర్నూల్ జిల్లా ఆస్పత్రిలో వైద్యుల నిర్లక్ష్యం మరోసారి బయటపడింది. కడుపులో ఉన్న బిడ్డ మృతి చెంది మూడు రోజులు అయినప్పటికీ ఆ విషయం చెప్పకుండా నామమాత్రపు పరీక్షలు చేసి గర్భిణీ స్త్రీని తిట్టి పంపారు. తీరా అధికంగా పురిటి నొప్పులు రావడంతో అసలు విషయం బయటపడింది. నాలుక కార్చుకొన్న వైద్యులు పాలమూరు ఆస్పత్రికి రెఫర్ చేశారు. చివరికి ఆపరేషన్ చేసి మృతి చెందిన పిండాన్ని బయటికి తీయాల్సిన పరిస్థితి ఏర్పడింది. వివరాల్లోకి వెళ్తే […]

Update: 2021-11-30 01:38 GMT

దిశ, నాగర్‌కర్నూల్: నాగర్ కర్నూల్ జిల్లా ఆస్పత్రిలో వైద్యుల నిర్లక్ష్యం మరోసారి బయటపడింది. కడుపులో ఉన్న బిడ్డ మృతి చెంది మూడు రోజులు అయినప్పటికీ ఆ విషయం చెప్పకుండా నామమాత్రపు పరీక్షలు చేసి గర్భిణీ స్త్రీని తిట్టి పంపారు. తీరా అధికంగా పురిటి నొప్పులు రావడంతో అసలు విషయం బయటపడింది. నాలుక కార్చుకొన్న వైద్యులు పాలమూరు ఆస్పత్రికి రెఫర్ చేశారు. చివరికి ఆపరేషన్ చేసి మృతి చెందిన పిండాన్ని బయటికి తీయాల్సిన పరిస్థితి ఏర్పడింది. వివరాల్లోకి వెళ్తే నాగర్ కర్నూలు జిల్లా తాడూరు మండలం ఐతోలు గ్రామానికి చెందిన గర్భిణీ రేణుక రెండో కాన్పు కోసం జిల్లా ఆస్పత్రికి వచ్చింది. మూడు రోజుల క్రితం కడుపు బిగ్గరగా ఉందని పురిటి నొప్పులతో బాధపడుతూ.. జిల్లా ఆస్పత్రిలో చేరింది.

అక్కడి వైద్యులు పరీక్షించి ఇంకా ప్రసవానికి సమయం ఉందని తిప్పి పంపారు. మరోసారి సోమవారం ఉదయం నొప్పులు అలాగే ఉండడంతో ఆస్పత్రికి వచ్చింది. అప్పుడు కూడా పరీక్షలు జరిపి ఓపిక పట్టాలని చెబుతూ పంపారు. తీరా అర్ధరాత్రి నొప్పులు అధికం కావడంతో 108 సాయంతో జిల్లా ఆస్పత్రికి వచ్చారు. అప్పుడు అసలు విషయం చెప్పి పాలమూరు ఆస్పత్రికి రెఫర్ చేశారు. చివరికి ఆపరేషన్ ద్వారా మృతి చెందిన మగ బిడ్డను బయటికి తీసి తల్లి ప్రాణం కాపాడారు. వైద్యుల అలసత్వం పెచ్చుమీరుతోందని కనీస పరీక్షలు కూడా చేయడం లేదని మండిపడుతున్నారు. తూతూమంత్రంగా పరీక్షలు జరిపి తల్లి ప్రాణం రిస్కులో పెట్టారని బాధపడుతున్నారు.

Tags:    

Similar News