అన్నా.. ఒక్కసారి చూపించు ప్లీజ్.. చైతుని వేడుకుంటున్న అభిమానులు
దిశ, సినిమా: అక్కినేని హీరో నాగచైతన్య సమంతతో విడాకుల బాధ నుండి బయటకు రావడానికి వరుస సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా ఉన్నాడు. తాజాగా ‘లవ్ స్టోరి’ సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్న చైతు.. అటు బాలీవుడ్ ఇటు టాలీవుడ్ ప్రాజెక్ట్స్ కంప్లీట్ చేసే పనిలో బిజీగా ఉన్నాడు. విక్రమ్ కుమార్ దర్శకత్వంలో ‘థాంక్యూ’ సినిమా షూటింగ్‌లో పాల్గొంటున్న చైతు.. ఇందులో హాకీ ప్లేయర్‌గా కనిపించనుండగా, ఇందుకోసం జిమ్‌లో కఠినమైన వర్కౌట్స్ చేస్తూ బాడీ బిల్డ్ చేసుకుంటున్నాడు. […]
దిశ, సినిమా: అక్కినేని హీరో నాగచైతన్య సమంతతో విడాకుల బాధ నుండి బయటకు రావడానికి వరుస సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా ఉన్నాడు. తాజాగా ‘లవ్ స్టోరి’ సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్న చైతు.. అటు బాలీవుడ్ ఇటు టాలీవుడ్ ప్రాజెక్ట్స్ కంప్లీట్ చేసే పనిలో బిజీగా ఉన్నాడు. విక్రమ్ కుమార్ దర్శకత్వంలో ‘థాంక్యూ’ సినిమా షూటింగ్‌లో పాల్గొంటున్న చైతు.. ఇందులో హాకీ ప్లేయర్‌గా కనిపించనుండగా, ఇందుకోసం జిమ్‌లో కఠినమైన వర్కౌట్స్ చేస్తూ బాడీ బిల్డ్ చేసుకుంటున్నాడు.
తండ్రి నాగార్జునతో కలిసి ‘బంగార్రాజు’ షూటింగ్‌కు కూడా హాజరవుతున్న చై.. ఎంత బిజీ షెడ్యూల్‌లో ఉన్నా వర్కౌట్ మాత్రం మిస్ కానని చెప్తున్నాడు. షూటింగ్ స్పాట్‌లో తన కోసం జిమ్ సెటప్ ఏర్పాటు చేసిన వారికి థాంక్స్ చెబుతూ ఇన్‌స్టా స్టోరీస్‌లో లేటెస్ట్ పిక్ షేర్ చేశాడు. దీనిపై స్పందించిన నెటిజన్లు.. ‘ఏంటన్నా నువ్వు మంచి బాడీ పెట్టుకొని సైలెంట్‌గా ఉంటావు. ఒక్కసారి కూడా సిక్స్ ప్యాక్ చూపించలేదు. కనీసం నెక్ట్స్ మూవీలో అయినా సిక్స్ ప్యాక్‌తో దుమ్ములేపు’ అని సూచిస్తున్నారు.