బెల్లి లలిత మరణం చిరస్మరణీయం..
దిశ, భువనగిరి రూరల్: యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలో అంబేద్కర్ చౌరస్తా వద్ద నయీం డైరీ సినిమాలో బెల్లి లలిత ను కించపరిచే విధంగా దృశ్యాలు ఉన్నాయంటూ.. నిరసిస్తూ డైరెక్టర్ బాలాజీ దిష్టిబొమ్మను దగ్ధం చేయడం జరిగింది. ఈ సందర్భంగా బెల్లి లలిత కుటుంబ సభ్యులు మాట్లాడుతూ.. ఈ సినిమాను దర్శకుడు బాలాజీ నయీం జీవితాన్ని తెరకెక్కించారు. ఈ క్రమంలో మలిదశ తెలంగాణ ఉద్యమకారులు అయిన బెల్లి లలిత జీవిత చరిత్ర తెలుసుకోకుండా ఆమెను కించపరిచేలా దర్శకుడు […]
దిశ, భువనగిరి రూరల్: యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలో అంబేద్కర్ చౌరస్తా వద్ద నయీం డైరీ సినిమాలో బెల్లి లలిత ను కించపరిచే విధంగా దృశ్యాలు ఉన్నాయంటూ.. నిరసిస్తూ డైరెక్టర్ బాలాజీ దిష్టిబొమ్మను దగ్ధం చేయడం జరిగింది. ఈ సందర్భంగా బెల్లి లలిత కుటుంబ సభ్యులు మాట్లాడుతూ.. ఈ సినిమాను దర్శకుడు బాలాజీ నయీం జీవితాన్ని తెరకెక్కించారు. ఈ క్రమంలో మలిదశ తెలంగాణ ఉద్యమకారులు అయిన బెల్లి లలిత జీవిత చరిత్ర తెలుసుకోకుండా ఆమెను కించపరిచేలా దర్శకుడు తెరకెక్కిస్తున్నారని ఇటీవల అతను ఇచ్చిన ఇంటర్వ్యూ చూస్తే స్పష్టంగా అర్ధమవుతున్నదన్నారు.
అంతే కాకుండా పోలిస్ వ్యవస్థను కూడా కించపరిచేలా ఆ ఇంటర్వ్యూ లో మాట్లాడటం జరిగింది అని అన్నారు. నయీమ్ అనే నరరూప రాక్షసుడిని హీరోగా చూపించి చిత్ర దర్శకుడు సమాజానికి, యువతకు ఏం సందేశం ఇవ్వాలనుకుంటున్నారు అని వారు ప్రశ్నించారు. ఈ సినిమా వల్ల సమాజానికి ప్రమాదం జరిగే అవకాశం ఉందన్నారు. బెల్లి లలితను, తెలంగాణ ఉద్యమాన్ని అవమానించే విధంగా సినిమా ఉంటె రాష్ట్ర వ్యాప్త ఆందోళన చేపడుతామని వారు హెచ్చరించారు.
ఈ సినిమాను ముందుగా బెల్లి లలిత కుటుంబ సభ్యులకు చూపించి వారి అభ్యంతరాలు స్వీకరించి మార్పులు చేసిన అనంతరమే సినిమా విడుదల చేయాలని వారు డిమాండ్ చేశారు. అదే విధంగా ఇంటర్వ్యూలో బెల్లి లలిత వ్యక్తిత్వాన్ని కించపరిచేలా మాట్లాడిన చిత్ర దర్శకుడు బాలాజీ ఆమె కుటుంబ సభ్యులకు బహిరంగ క్షమాపణ చెప్పాలన్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణా గానకోకిల బెల్లి లలిత యువజన సంఘం నాయకులు జాగృతి,కొండల,శివుడు,భాగ్యరాజ్,నవీన్,సంజీవ,శివ,సాయి తదితరులు పాల్గొన్నారు.