నా కుటుంబ సభ్యులకు కూడా కరోనా వచ్చింది: గుత్తా

దిశ ప్రతినిధి, నల్లగొండ: మనోధైర్యమే కరోనాకు అసలైన మందు అని, కోవిడ్ పాజిటివ్ వచ్చిన వ్యక్తులకు మానసికంగా ఇబ్బందులకు గురి చేయోద్దని శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు. ఆదివారం నల్లగొండలోని తన నివాసంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సుఖేందర్ రెడ్డి మాట్లాడుతూ.. కొన్నిచోట్ల కోవిడ్ పాజిటివ్ వ్యక్తులను మానసికంగా వేదనకు గురి చేసిన సంఘటనలు చోటు చేసుకోవడం బాధాకరమన్నారు. నా కుటుంబ సభ్యులకు కూడా కరోనా పాజిటివ్ వచ్చిందన్నారు. హోం క్వారంటైన్‌లో […]

Update: 2020-07-26 03:34 GMT

దిశ ప్రతినిధి, నల్లగొండ: మనోధైర్యమే కరోనాకు అసలైన మందు అని, కోవిడ్ పాజిటివ్ వచ్చిన వ్యక్తులకు మానసికంగా ఇబ్బందులకు గురి చేయోద్దని శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు. ఆదివారం నల్లగొండలోని తన నివాసంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సుఖేందర్ రెడ్డి మాట్లాడుతూ.. కొన్నిచోట్ల కోవిడ్ పాజిటివ్ వ్యక్తులను మానసికంగా వేదనకు గురి చేసిన సంఘటనలు చోటు చేసుకోవడం బాధాకరమన్నారు. నా కుటుంబ సభ్యులకు కూడా కరోనా పాజిటివ్ వచ్చిందన్నారు. హోం క్వారంటైన్‌లో ఉన్నారని, 15 రోజుల్లో కరోనా వైరస్ నుంచి కోలుకున్నారని తెలిపారు.

ఉస్మానియా హాస్పిటల్ విషయంలో ప్రతిపక్షాలు దిగజారుడు రాజకీయం చేస్తున్నాయని పేర్కొన్నారు. ఉస్మానియా హాస్పిటల్ బిల్డింగ్ శిథిలావస్థకు చేరిందని, దాన్ని కూల్చేసి కొత్త బిల్డింగ్ కట్టాలని గతంలోనే ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని గుర్తు చేశారు. అప్పుడు ఉస్మానియా బిల్డింగ్ హెరిటేజ్ బిల్డింగ్ కూల్చవద్దని ధర్నాలు చేసి, కోర్టులో కేసులు వేసిన నేతలు.. మొన్న హాస్పిటల్ లోకి నీళ్లు రాగానే అక్కడికి వెళ్లి కొత్త భవనం కట్టాలంటూ ప్రెస్ మీట్‌లు పెట్టారన్నారు. సచివాలయం, అసెంబ్లీ బిల్డింగ్స్ కూడా పురాతన భవనాలన్నారు. ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా పాలన చేయడానికి ఆ భవనాలు సరిపోవడం లేదని, గత వానాకాలంలో తెలంగాణ కౌన్సిల్ భవనంలో మూడు ఫీట్ల వరకు నీళ్లు వచ్చాయని వివరించారు.

అధునాతన సౌకర్యాలతో సెక్రటేరియట్, అసెంబ్లీ భవనాలు కట్టాల్సిన అవసరం ఉందని, కోర్టుల్లో కేసులు వేసి ప్రతిపక్షాలు అభివృద్ధిని అడ్డుకోవాలని చూస్తున్నాయని ఆరోపించారు. జిల్లాల్లో మెరుగైన వైద్య సేవల కోసం అంబులెన్స్‌లు ఏర్పాటు చేయడం చాలా మంచి పరిణామమని వివరించారు. కేటీఆర్‌కి ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు ఉందని, గొప్ప విజన్ ఉన్న నాయకుడు కేటీఆర్ అని కితాబిచ్చారు. తెలుగు, హిందీ, ఇంగ్లీష్ భాషల్లో అనర్గళంగా మాట్లాడగలిగిన గొప్ప టాలెంట్ కేటీఆర్‌కి ఉందని తెలిపారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాకు రెండు మెడికల్ కాలేజీలు, ఎయిమ్స్‌ని కేటాయించిన ముఖ్యమంత్రికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. అనంతరం సీఎంఆర్ఎఫ్ నుంచి మంజూరు అయిన చెక్కులను గుత్తా సుఖేందర్ రెడ్డి పంపిణీ చేశారు.

Tags:    

Similar News