స్థానిక భాషల్లో.. అంతర్జాతీయ చిత్రాలు
దిశ, ఫీచర్స్ : చిన్న సినిమాలే కాదు భారీ బడ్జెట్, స్టార్ కాస్టింగ్ ఉన్న చిత్రాలు కూడా ఇప్పుడు ‘ఓటీటీ’ వేదికగానే విడుదలవుతున్నాయి. అంతేకాదు పాండమిక్ తర్వాత ప్రేక్షకులు డిఫరెంట్ జోనర్స్‌కు చెందిన విభిన్న భాషా చిత్రాలను చూసేందుకు అలవాటుపడ్డారు. కంటెంట్ ఉంటే చాలు.. లాంగ్వేజ్‌తో పనిలేకుండా సినిమాను ఆస్వాదిస్తూ ఆదరిస్తున్నారు. తమ ఫేవరెట్ ప్లాట్‌ఫామ్స్‌లో ‘న్యూ షోస్’ కోసం ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలోనే వివిధ భాషలకు చెందిన సూపర్ హిట్ చిత్రాలను లోకల్ లాంగ్వేజ్‌లో డబ్ […]
దిశ, ఫీచర్స్ : చిన్న సినిమాలే కాదు భారీ బడ్జెట్, స్టార్ కాస్టింగ్ ఉన్న చిత్రాలు కూడా ఇప్పుడు ‘ఓటీటీ’ వేదికగానే విడుదలవుతున్నాయి. అంతేకాదు పాండమిక్ తర్వాత ప్రేక్షకులు డిఫరెంట్ జోనర్స్‌కు చెందిన విభిన్న భాషా చిత్రాలను చూసేందుకు అలవాటుపడ్డారు. కంటెంట్ ఉంటే చాలు.. లాంగ్వేజ్‌తో పనిలేకుండా సినిమాను ఆస్వాదిస్తూ ఆదరిస్తున్నారు. తమ ఫేవరెట్ ప్లాట్‌ఫామ్స్‌లో ‘న్యూ షోస్’ కోసం ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలోనే వివిధ భాషలకు చెందిన సూపర్ హిట్ చిత్రాలను లోకల్ లాంగ్వేజ్‌లో డబ్ చేయడం లేదా సబ్ టైటిల్స్‌లో అందించడం ద్వారా ఓటీటీలు తమ ప్లాట్‌ఫామ్ ట్రాఫిక్ పెంచుకుంటున్నాయి. ఈ విషయంలో తెలుగు డిజిటల్ ప్లాట్‌ఫామ్ ‘ఆహా’ అందరికంటే ముందుండగా.. తమిళ్, మలయాళీ హిట్ సినిమాలను తెలుగులో డబ్ చేసి విడుదల చేస్తున్న సంగతి తెలిసిందే. ఇక అమెజాన్‌లోని హాలీవుడ్ చిత్రాలను సైతం ఇప్పుడు స్థానిక భాషల్లో చూసే అవకాశముంది. అయితే కొన్ని భాషా చిత్రాలకే ఇది పరిమితం కాగా, స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్ ఎంఎక్స్ ప్లేయర్(MX Player).. ‘ఎంఎక్స్ వర్సెస్ విదేశీ (MX VDesi) షో’ ద్వారా అంతర్జాతీయ కంటెంట్ అందిస్తూ ఆ గ్యాప్‌ను ఫుల్‌ఫిల్ చేసేందుకు ప్రయత్నిస్తోంది. ఇంతకీ ఈ న్యూ ప్రోగ్రామ్‌లో ఎలాంటి చిత్రాలు అందుబాటులో ఉన్నాయి. ఇప్పటివరకు వచ్చిన చిత్రాలేంటో తెలుసుకుందాం.
ఇండియన్ సినీ ప్రేక్షకులు అన్ని లాంగ్వేజ్ చిత్రాలను ఆదరిస్తారన్న విషయం తెలిసిందే. ఇక ఓటీటీ వచ్చాక లాంగ్వేజ్ బ్యారియర్ పూర్తిగా తొలగిపోయింది. స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్స్ ఈ అవకాశాన్ని అందిపుచ్చుకుంటుండగా.. ఎంఎక్స్ ప్లేయర్ ‘ఎంఎక్స్ విదేశీ’ పేరుతో టర్కిష్, కొరియన్, జపనీస్, ఫ్రెంచ్, స్పానిష్, ఇంగ్లీష్ భాషల్లోని సూపర్ హిట్ చిత్రాలను హిందీ, తమిళ, తెలుగు భాషల్లో అనువదించి ప్రేక్షకులకు అందిస్తోంది.
డాక్టర్ రొమాంటిక్
ఇదొక కొరియన్ టీవీ సిరీస్. మొదటి సీజన్ సూపర్ సక్సెస్ కాగా, గతేడాది రెండో సిరీస్‌గా విడుదలైన ‘డా.రొమాంటిక్’ హిట్ టాక్ సొంతం చేసుకుంది. ముగ్గురు డాక్టర్ల కథగా తెరకెక్కిన ఈ సిరీస్‌లో ప్రఖ్యాత సర్జన్ కిమ్ సా బు.. వైద్యవృత్తిలో ‘హ్యాండ్ ఆఫ్ గాడ్’గా పేరుతెచ్చుకుంటాడు. అయితే సడెన్‌గా తన లగ్జరీ లైఫ్‌ను విడిచి, ఓ చిన్న పట్టణంలో ఏకాంతంగా జీవించడానికి సిద్ధపడతాడు. అక్కడ ‘టీచర్ కిమ్@రొమాంటిక్ డాక్టర్’గా పనిచేస్తూ జూనియర్ డాక్టర్లను గైడ్ చేస్తుంటాడు. ఇక రెండో సర్జన్ కాంగ్ డాంగ్ జు.. జీవితంలో ఆర్థికంగా స్థిరపడేందుకు వీఐపీ రోగులను వెతుకుతుంటాడు. తెలివితో పాటు అద్భుత నైపుణ్యాలున్నా గానీ విజయవంతం కాలేకపోతాడు. ఒక వీఐపీ పెషెంట్‌కు శస్త్రచికిత్స విఫలమైన తర్వాత అతను డోల్డమ్ ఆస్పత్రికి బదిలీ అవుతాడు. ఇది అతని నైపుణ్యాలను నిరూపించుకోవడానికి ఒక అవకాశం కాగా, ఇక్కడే ‘రొమాంటిక్ డాక్టర్’ను కలుస్తాడు. ఇక మూడో సర్జన్ యూన్ సియో జంగ్.. అందరికంటే ఎక్కువ గుర్తింపు పొందాలనే బలమైన కోరికను కలిగి ఉంటుంది. అయితే తన ప్రియుడు మరణించిన తర్వాత, ఆమె జియోసాన్ విశ్వవిద్యాలయ ఆస్పత్రి నుంచి అదృశ్యమవుతుంది. తనను తాను గాయపరుచుకుని, ప్రమాదంలోపడ్డ ఆమెను కిమ్ సా-బు రక్షిస్తాడు. ఆ తర్వాత ఆమె డోల్డమ్ ఆస్పత్రిలో డాక్టర్ అవుతుంది. డాక్టర్ రొమాంటిక్ శిక్షణలో ఈ ఇద్దరు ఎలాంటి నైపుణ్యాలను పొందారు, వైద్యవృత్తిలో సక్సెస్ అయ్యారా? లేదా అన్నదే మొత్తం సిరీస్. కాగా హిందీ డబ్బింగ్ వెర్షన్‌లో ఎంఎక్స్ ప్లేయర్‌లో అందుబాటులో ఉంది.
యాడ్ విటమ్
ఫ్రెంచ్ లాంగ్వేజ్‌లో తెరకెక్కిన ఈ సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్.. పునరుత్పత్తి ప్రక్రియ ద్వారా మానవ జీవితాన్ని నిరవధికంగా పొడిగించగలిగినప్పుడు, మానవులకు ఎలాంటి జీవితం ఉంటుంది? అనే ప్రశ్నకు సమాధానమిస్తుంది. ఒకవేళ రీజనరేషన్ జరిగితే.. అధిక జనాభా సమస్య ఎదుర్కొంటాం. మనుషుల వృద్ధులైనా సరే పనిచేస్తూనే ఉంటారు. దశాబ్దాల అనుభవం ఉన్నవారు అందుబాటులోకి ఉన్న కారణంగా కొత్త తరానికి ఉద్యోగాలు లభించవు. ఇలాంటి అంశాలను చక్కగా తెరకెక్కించిన దర్శకుడు.. ఈ రీజనరేషన్ అంశానికి బీచ్‌లో ఆత్మహత్య చేసుకున్న ఏడుగురికి సంబంధించిన మిస్టరీతో లింక్ చేస్తాడు. వాళ్లది హత్యా? ఆత్మహత్యా? తెలుసుకునేందుకు సిద్ధమైన డిటెక్టివ్ డారియస్.. ఇందుకోసం టీనేజర్ క్రిస్టా సహాయం తీసుకుంటాడు. అతడు ఫైనల్‌గా ఈ కేస్ సాల్వ్ చేయడంతో సిరీస్ ముగుస్తుంది. సైన్స్ ఫిక్షన్‌ను ఇష్టపడే ప్రతి ఒక్కరూ చూడదగ్గ ‘యాడ్ విటమ్’ సిరీస్‌ను ఎంఎక్స్ ప్లేయర్‌లో హిందీ వెర్షన్‌లో చూడొచ్చు.
ఇక టర్కిష్ డ్రామా ‘ద చాయిస్’ హిందీ, తెలుగు, తమిళ భాషల్లో అందుబాటులో ఉంది. ఎంఎక్స్ ప్లేయర్ ప్రతి బుధవారం MX VDesi ప్రొగ్రామ్‌లో భాగంగా.. ‘న్యూ మూవీ/సిరీస్’ విడుదల చేస్తుంది. ఇప్పటికే ‘డే డ్రీమర్, ది ప్రామిస్, అవర్ స్టోరీ, ది గర్ల్ నేమ్డ్ ఫెరిహా, ఎండ్‌లెస్ లవ్, బ్రేవ్ అండ్ బ్యూటిఫుల్, ఫర్‌బిడెన్ ఫ్రూట్’ వంటి ఇంటర్నేషనల్ మూవీస్, సిరీస్‌లు అందించింది. అంతర్జాతీయ చిత్రాలు చూసేందుకు ఎంఎక్స్ ప్లేయర్ చక్కని వేదికగా నిలుస్తుండగా, ఇందులో సినిమాలు చూడాలంటే ఎలాంటి సబ్‌స్క్రిప్షన్ అవసరం లేదు. అంతా ఉచితమే!