టిక్‌టాక్ కాదు..టకాటక్

దిశ, వెబ్ డెస్క్: చైనా పాపులర్ వీడియో షేరింగ్ యాప్ టిక్‌టాక్ బ్యాన్ కావడంతో.. ఆల్టర్నేట్ యాప్‌లు తెగ వచ్చేస్తున్నాయి. టిక్‌టాక్ పాపులారిటీని వాడుకోవడానికి దాదాపు ప్రస్తుతం మార్కెట్లో ఉన్న ఇతర యాప్ డెవలపర్ కంపెనీలు చాలా ప్రయత్నాలు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే మిత్రోన్, చింగారీ, చట్‌పట్, మోజ్ యాప్‌లు వచ్చాయి. అటు యూట్యూబ్ కూడా షార్ట్ వీడియోలకు అవకాశం ఇస్తున్నట్లు తెలిపింది. ఇటు ఇన్‌స్టా కూడా ‘రీల్స్’ పేరుతో పొట్టి వీడియోలను ఆహ్వానిస్తోంది. ఈ క్రమంలోనే […]

Update: 2020-07-10 05:44 GMT

దిశ, వెబ్ డెస్క్: చైనా పాపులర్ వీడియో షేరింగ్ యాప్ టిక్‌టాక్ బ్యాన్ కావడంతో.. ఆల్టర్నేట్ యాప్‌లు తెగ వచ్చేస్తున్నాయి. టిక్‌టాక్ పాపులారిటీని వాడుకోవడానికి దాదాపు ప్రస్తుతం మార్కెట్లో ఉన్న ఇతర యాప్ డెవలపర్ కంపెనీలు చాలా ప్రయత్నాలు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే మిత్రోన్, చింగారీ, చట్‌పట్, మోజ్ యాప్‌లు వచ్చాయి. అటు యూట్యూబ్ కూడా షార్ట్ వీడియోలకు అవకాశం ఇస్తున్నట్లు తెలిపింది. ఇటు ఇన్‌స్టా కూడా ‘రీల్స్’ పేరుతో పొట్టి వీడియోలను ఆహ్వానిస్తోంది. ఈ క్రమంలోనే వీడియో ప్లేయర్ దిగ్గజం …ఎమ్ఎక్స్ ప్లేయర్ టిక్‌టాక్‌ను పోలిన.. ‘టకాటక్’ యాప్‌ను రూపొందించింది. ఈ యాప్ తాజాగా గూగుల్ ప్లే స్టోర్‌లో‌ అందుబాటులోకి వచ్చింది.

టకాటక్ (Taka Tak) యాప్ ఫీచర్లు యూజర్లను ఆకట్టుకునేలా ఉన్నాయి. ఫన్నీ వీడియోలను వీక్షించడంతో పాటు, సోషల్ మీడియా ప్లాట్‌ఫాంలో షేర్ చేసుకోవచ్చు. డైలాగ్ డబ్బింగ్, కామెడీ, గేమింగ్, డీఐవై, ఫుడ్, స్పోర్ట్స్, మీమ్స్, ఇలా అన్ని తరహా వీడియోలను ఇందులో బ్రౌజ్ చేసుకోవచ్చు. యాప్‌లో షార్ట్ ఫన్ మ్యూజిక్ వీడియోలను క్రియేట్ చేసుకోవచ్చు. ఫేవరేట్ మూవీ డైలాగ్స్‌ను డబ్ చేసుకోవచ్చు. ఫేస్‌బుక్, వాట్సాప్ వంటి సోషల్ ప్లాట్‌ఫాముల్లోనూ షేర్ చేసుకోవచ్చు.

మనం రూపొందించిన షార్ట్ వీడియోలను ఎడిటింగ్ ఫీచర్‌లో ఉన్న ఎఫెక్ట్‌లతో ఎడిట్ చేసుకుని.. వాటిని సోషల్ మీడియా వేదికల్లో షేర్ చేసుకోవచ్చు.

మెయిన్ ఫీచర్స్:

ట్రెండింగ్ వీడియోస్:
ఈ యాప్‌లో ట్రెండింగ్, హాట్, ఫన్నీ, అమెజింగ్, వీడియోలను బ్రౌజ్ చేసుకోవచ్చు.

సేవ్ అండ్ షేర్ స్టేటస్:
10 వేల వరకు స్టేటస్ వీడియోలు ఇందులో అందుబాటులో ఉన్నాయి.

షూట్ అండ్ ఎడిట్:
ఎడిటింగ్ ఫీచర్ల ద్వారా యూజర్లు షూట్ చేసిన వీడియోలకు తమ క్రియేటివిటిని జోడించి.. వీడియోలను ఆన్ లైన్‌లో షేర్ చేసుకోవచ్చు.

బ్యూటీ కెమెరా:
వీడియో తీసేటప్పుడు..బ్యూటీ ఎఫెక్టులు, ఫిల్టర్లను యూజర్లు చూజ్ చేసుకోవచ్చు.

వీడియో ఎడిటర్:
వీడియోలను కంబైన్ చేయవచ్చు.. టైమింగ్‌తో పాటు వీడియో సైజును కూడా సరిచేయొచ్చు.

ఫొటో ఎడిటర్:
నచ్చిన ఫొటోలను యూజర్లు ఎంచుకోవచ్చు.. స్టోరీ మాదిరిగా వాటితో వీడియో క్రియేట్ చేసుకోవచ్చు.

మ్యూజిక్ లైబ్రరీ:
ఎడిటర్ పిక్ చేసిన వాటితో ఫ్రెష్ మ్యూజిక్ లైబ్రరీ కూడా ఇందులో ఉంది.

లాంగ్వేజ్ సపోర్ట్: ఇంగ్లీష్, తెలుగు, కన్నడ, హిందీ, తమిళ్, మలయాళం, బెంగాలీ, గుజరాతీ, మరాఠి, పంజాబీ భాషలను ఇది సపోర్ట్ చేస్తుంది.

Tags:    

Similar News