‘వచ్చే ఆర్థిక సంవత్సరంలో అదే మా టార్గెట్’

దిశ, వెబ్‌డెస్క్: 2021-22లో రూ. 700 కోట్ల గృహ రుణాలను పంపిణీ చేయాలని భావిస్తున్నట్టు ముత్తూట్ ఫైనాన్స్ అనుబంధ సంస్థ ముత్తూట్ హోమ్‌ఫిన్ ఇండియా లిమిటెడ్ ఆదివారం తెలిపింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి తొమ్మిది నెలల్లో సంస్థ రూ. 85.6 కోట్లను పంపిణీ చేసింది. అంతకుముందు ఆర్థిక సంవత్సరంలో రూ. 356.4 కోట్ల రుణాలను ఇచ్చినట్టు కంపెనీ ఓ ప్రకటనలో పేర్కొంది. ప్రస్తుతం సంస్థకు రూ. 1,800 కోట్ల నిర్వహణ ఆస్తులు ఉన్నాయని స్పష్టం చేసింది. […]

Update: 2021-02-21 08:30 GMT

దిశ, వెబ్‌డెస్క్: 2021-22లో రూ. 700 కోట్ల గృహ రుణాలను పంపిణీ చేయాలని భావిస్తున్నట్టు ముత్తూట్ ఫైనాన్స్ అనుబంధ సంస్థ ముత్తూట్ హోమ్‌ఫిన్ ఇండియా లిమిటెడ్ ఆదివారం తెలిపింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి తొమ్మిది నెలల్లో సంస్థ రూ. 85.6 కోట్లను పంపిణీ చేసింది. అంతకుముందు ఆర్థిక సంవత్సరంలో రూ. 356.4 కోట్ల రుణాలను ఇచ్చినట్టు కంపెనీ ఓ ప్రకటనలో పేర్కొంది. ప్రస్తుతం సంస్థకు రూ. 1,800 కోట్ల నిర్వహణ ఆస్తులు ఉన్నాయని స్పష్టం చేసింది.

‘వచ్చే ఆర్థిక సంవత్సరంలో రూ. 700 కోట్ల గృహ రుణాలను అందించాలనే లక్ష్యాలను కలిగి ఉన్నాము. దేశంలోని ప్రతి పౌరుడు సరసమైన గృహావసరాలను తీర్చాలనే ప్రభుత్వం చొరవకు ముందుకు తీసుకెళ్లే ప్రయత్నాలను కొనసాగిస్తామని’ కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ జార్జ్ అలెగ్జాండర్ ముత్తూట్ చెప్పారు. అంతేకాకుండా, దేశంలోని దక్షిణాది రాష్ట్రాల్లో తమ కార్యకలాపాలను విస్తరించడంపై దృష్టి సారిస్తామన్నారు. కాగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం డిసెంబర్‌తో ముగిసిన త్రైమాసికంలో కంపెనీ స్వతంత్ర లాభాలు 82.7 శాతం క్షీణించాయి.

Tags:    

Similar News