మొండికేసిన మూసీ గేట్.. ఆందోళనలో రైతులు
దిశ, వెబ్ డెస్క్: మూసీ ప్రాజెక్ట్ 9వ నెంబర్ గేట్ మొండికేసింది. సపోర్ట్ వెయిట్ విరగడంతో ఈ గేట్ మొరాయించింది. గత మూడు రోజులుగా నాలుగు గేట్ల నుంచి నీరు విడుదల చేస్తున్నారు. పోయినేడాది 5వ నంబర్ రెగ్యులేటరీ గేట్ పక్కకు జరగడంతో నీరు వృధాగా పోయి ప్రాజెక్ట్ ఖాళీ అయింది. ఈసారి కూడా గత ఏడాది మాదిరిగానే నీరు మొత్తం వృథా అవుతుందేమోనని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ తరుణంలో సూర్యాపేట కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి ప్రాజెక్టును పరిశీలించారు. […]
దిశ, వెబ్ డెస్క్: మూసీ ప్రాజెక్ట్ 9వ నెంబర్ గేట్ మొండికేసింది. సపోర్ట్ వెయిట్ విరగడంతో ఈ గేట్ మొరాయించింది. గత మూడు రోజులుగా నాలుగు గేట్ల నుంచి నీరు విడుదల చేస్తున్నారు. పోయినేడాది 5వ నంబర్ రెగ్యులేటరీ గేట్ పక్కకు జరగడంతో నీరు వృధాగా పోయి ప్రాజెక్ట్ ఖాళీ అయింది.
ఈసారి కూడా గత ఏడాది మాదిరిగానే నీరు మొత్తం వృథా అవుతుందేమోనని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ తరుణంలో సూర్యాపేట కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి ప్రాజెక్టును పరిశీలించారు. నిజామాబాద్ నుంచి క్రేన్, సపోర్ట్ వెయిట్ తెప్పించి మరమ్మత్తులు చేయిస్తామని కలెక్టర్ తెలిపారు. ఇన్ ఫ్లో వస్తున్నందున ప్రాజెక్ట్‌లో నీటి నిల్వపై రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు.