పంజాబ్ కాంగ్రెస్‌లో ముసలం
దిశ వెబ్‌డెస్క్: ఎన్నికల ముందు పంజాబ్ కాంగ్రెస్‌లో ముసలం బయల్ధేరినట్లు కనిపిస్తోంది. ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్‌కు వ్యతిరేకంగా దాదాపు 30 మంది శాసన సభ్యులు, ముగ్గురు మంత్రులు కాంగ్రెస్ పార్టీ హైకమాండ్‌కు ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. వెంటనే ముఖ్యమంత్రిని తొలగించాలని వారంతా పార్టీ అధినాయకత్వం పై ఒత్తిడి చేస్తున్నట్లు కాంగ్రెస్ పార్టీ వర్గాల భోగట్టా! బుధవారం సిద్దూ సలహదారులు కశ్మీర్ స్వతంత్ర దేశమని ఇండియా, పాకిస్తాన్ రెండు దాన్ని ఆక్రమించుకోవటానికి చూస్తున్నాయని వివాదాస్పద మాటలన్నారు. ఇలాంటి వ్యాఖ్యల […]
దిశ వెబ్‌డెస్క్: ఎన్నికల ముందు పంజాబ్ కాంగ్రెస్‌లో ముసలం బయల్ధేరినట్లు కనిపిస్తోంది. ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్‌కు వ్యతిరేకంగా దాదాపు 30 మంది శాసన సభ్యులు, ముగ్గురు మంత్రులు కాంగ్రెస్ పార్టీ హైకమాండ్‌కు ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. వెంటనే ముఖ్యమంత్రిని తొలగించాలని వారంతా పార్టీ అధినాయకత్వం పై ఒత్తిడి చేస్తున్నట్లు కాంగ్రెస్ పార్టీ వర్గాల భోగట్టా! బుధవారం సిద్దూ సలహదారులు కశ్మీర్ స్వతంత్ర దేశమని ఇండియా, పాకిస్తాన్ రెండు దాన్ని ఆక్రమించుకోవటానికి చూస్తున్నాయని వివాదాస్పద మాటలన్నారు. ఇలాంటి వ్యాఖ్యల వల్ల పార్టీ ప్రజల్లో చులకన అవుతుందని, కాంగ్రెస్ అంటే యాంటి ఇండియా అనే అర్థం వచ్చే రీతిలో వీరంతా వ్యవహరిస్తున్నారని ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్ వారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
పాకిస్తాన్, కశ్మీర్ విషయాలపై నోరు అదుపులో పెట్టుకోవాలని హెచ్చరించిన నేపథ్యంలో వీరంతా ఆయనకు ఎదురుతిరిగినట్లు తెలుస్తోంది. ఎదురు తిరిగిన శాసన సభ్యులకు ప్రతినిధులుగా ఐదుగురు ఎమ్మెల్యేలతో కూడిన బృందం ఢిల్లీకి చేరుకుందని, తమ అభిప్రాయాలను పార్టీ ముందు ఉంచారని సమాచారం. చాలామంది ఎమ్మెల్యేలు 2017 ఎన్నికల నాటి హమీలను అమలు చేయటంలో ముఖ్యమంత్రి విఫలమయ్యారని అధినేత్రి ముందుకు తీసుకొచ్చారని, దానికి హై కమాండ్ నుంచి తగిన ప్రతి స్పందన లభించిందని కాంగ్రెస్ పార్టీ వర్గాలు వెల్లడించాయి. అయితే కాంగ్రెస్ పార్టీ మరోసారి ముఖ్యమంత్రి మార్పును కోరుకోదని కొంతమంది నిపుణులు విశ్లేషిస్తున్నారు. వివిధ రాష్ట్రాల్లో ముఖ్యమంత్రులను మార్చిన ప్రతిసారీ కాంగ్రెస్ పార్టీ కుదేలయింది. అలా బయటకు వచ్చిన వారు కాంగ్రెస్ పార్టీని ఎన్నికల్లో తిరిగి బలం పుంజుకోలేనంత విధంగా దెబ్బకొట్టారు. వారిలో శరద్ పవార్, మమతా బెనర్జీ, జగన్ మోహన్ రెడ్డిని ప్రముఖులుగా చెప్పవచ్చు.