దళితులపై నటి కామెంట్స్.. అరెస్ట్ చేయాలని డిమాండ్

దిశ, సినిమా : యాక్ట్రెస్ మున్ మున్ దత్తా క్షమాపణలు చెప్పింది. ఓ యూట్యూబ్ వీడియోలో దళితులను తక్కువ చేసి మాట్లాడిన నటిని అరెస్ట్ చేయాలని ట్విట్టర్‌లో #ArrestMunmunDutta హ్యాష్‌ట్యాగ్‌ ట్రెండ్ అయింది. దీంతో తప్పు తెలుసుకున్న ఆమె సారీ చెప్పింది. తనకు భాషపై అంతగా అవగాహన లేదని, అందుకే ఈ తప్పు జరిగిందని వివరణ ఇచ్చింది. ఎవరి మనోభావాలను అవమానించడం తన ఉద్దేశం కాదని తెలిపింది. కాగా, యూట్యూబ్‌లో మేకప్ టిప్స్ గురించి వివరణ ఇస్తున్న […]

Update: 2021-05-11 06:47 GMT

దిశ, సినిమా : యాక్ట్రెస్ మున్ మున్ దత్తా క్షమాపణలు చెప్పింది. ఓ యూట్యూబ్ వీడియోలో దళితులను తక్కువ చేసి మాట్లాడిన నటిని అరెస్ట్ చేయాలని ట్విట్టర్‌లో #ArrestMunmunDutta హ్యాష్‌ట్యాగ్‌ ట్రెండ్ అయింది. దీంతో తప్పు తెలుసుకున్న ఆమె సారీ చెప్పింది. తనకు భాషపై అంతగా అవగాహన లేదని, అందుకే ఈ తప్పు జరిగిందని వివరణ ఇచ్చింది. ఎవరి మనోభావాలను అవమానించడం తన ఉద్దేశం కాదని తెలిపింది. కాగా, యూట్యూబ్‌లో మేకప్ టిప్స్ గురించి వివరణ ఇస్తున్న క్రమంలో తాను భంగీ(దళితు కులానికి చెందిన వ్యక్తి)గా కనిపించాలనుకోవడం లేదని, అందంగా ఉండాలని అనుకుంటున్నానని చెప్పడంతో ఈ వివాదం తలెత్తింది.

దీంతో కుల ప్రస్తావన తీసుకొస్తూ, దళితులను కించపరిచిన నటిపై ఆగ్రహం వ్యక్తం చేసిన నెటిజన్లు.. మున్‌మున్‌ను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. కాగా, ఈ నటి క్షమాపణలు తెలుపుతూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టింది. కానీ స్ట్రెయిట్‌గా చేసిన తప్పు ఒప్పుకోకుండా.. కేవలం తను మాట్లాడిన పదాన్ని నెగెటివ్‌గా పొట్రెయిట్ చేశారని పేర్కొనడంతో మళ్లీ విమర్శలపాలైంది.

 

Tags:    

Similar News