‘మీరు పనులు వేగవంతం చేయండి’

దిశ, వరంగల్: వరంగల్‎లో చేపట్టిన స్మార్ట్ సిటీ పునులను వేగవంతం చేయాలని.. కేంద్ర ప్రభుత్వ అర్బన్ అండ్ హౌసింగ్ అఫైర్స్ మిషన్ జాయింట్ సెక్రెటరీ కునాల్ కుమార్ అన్నారు. మంగళవారం ఆయన న్యూ ఢిల్లీ నుంచి మున్సిపల్ కమిషనర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా స్మార్ట్ సిటీ పనుల ప్రగతి, నిధుల కేటాయింపు, అందుబాటులో ఉన్న నిధులు తదితర అంశాలపై కార్పొరేషన్‌ల వారీగా సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. లాక్‌డౌన్ కారణంగా దేశ వ్యాప్తంగా […]

Update: 2020-05-19 07:18 GMT

దిశ, వరంగల్: వరంగల్‎లో చేపట్టిన స్మార్ట్ సిటీ పునులను వేగవంతం చేయాలని.. కేంద్ర ప్రభుత్వ అర్బన్ అండ్ హౌసింగ్ అఫైర్స్ మిషన్ జాయింట్ సెక్రెటరీ కునాల్ కుమార్ అన్నారు. మంగళవారం ఆయన న్యూ ఢిల్లీ నుంచి మున్సిపల్ కమిషనర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా స్మార్ట్ సిటీ పనుల ప్రగతి, నిధుల కేటాయింపు, అందుబాటులో ఉన్న నిధులు తదితర అంశాలపై కార్పొరేషన్‌ల వారీగా సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. లాక్‌డౌన్ కారణంగా దేశ వ్యాప్తంగా 42 స్మార్ట్ సిటీ టౌన్‎లలో అభివృద్ధి పనులకు అంతరాయం కలిగిందన్నారు. ప్రస్తుతం నిర్మాణాలకు వెసులుబాటు కల్పించినందున త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో వరంగల్ మున్సిపల్ కమిషనర్ పమేలా సత్పతి తదితరులు పాల్గొన్నారు.

Tags:    

Similar News