కోవిడ్ వ్యాక్సిన్ వేసుకోనందుకు రూ. 50 వేల ఫైన్

దిశ, వెబ్ డెస్క్: కోవిడ్ వ్యాప్తి నేపథ్యంలో అడ్డుకట్టవేసేందుకు కోవిడ్ వ్యాక్సిన్ తీసుకుంటున్న విషయం తెలిసిందే. ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వాలు ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటున్నాయి. కోవిడ్ వ్యాక్సిన్ తీసుకోవాలని.. మాస్క్ ధరించాలని చెబుతున్నాయి. అయినా కొందరు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ కోవిడ్ వ్యాప్తికి కారకులవుతున్నారు. తాజాగా ముంబై మున్సిపల్ కార్పొరేషన్(ఎన్ఎమ్ఎమ్ సీ) స్థానికంగా తనిఖీలు చేపట్టింది. ఓ మాల్ లో కోవిడ్ నిబంధనలను పాటించకపోవడాన్ని అధికారులు గుర్తించారు. మాల్ లో ఉన్న సిబ్బంది వ్యాక్సిన్ తీసుకున్నారా లేదా […]

Update: 2021-12-10 00:02 GMT

దిశ, వెబ్ డెస్క్: కోవిడ్ వ్యాప్తి నేపథ్యంలో అడ్డుకట్టవేసేందుకు కోవిడ్ వ్యాక్సిన్ తీసుకుంటున్న విషయం తెలిసిందే. ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వాలు ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటున్నాయి. కోవిడ్ వ్యాక్సిన్ తీసుకోవాలని.. మాస్క్ ధరించాలని చెబుతున్నాయి. అయినా కొందరు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ కోవిడ్ వ్యాప్తికి కారకులవుతున్నారు. తాజాగా ముంబై మున్సిపల్ కార్పొరేషన్(ఎన్ఎమ్ఎమ్ సీ) స్థానికంగా తనిఖీలు చేపట్టింది. ఓ మాల్ లో కోవిడ్ నిబంధనలను పాటించకపోవడాన్ని అధికారులు గుర్తించారు. మాల్ లో ఉన్న సిబ్బంది వ్యాక్సిన్ తీసుకున్నారా లేదా అని అధికారులు ఎంక్వైరీ చేశారు. వారు వ్యాక్సిన్ తీసుకోలేదని తేలింది. దీంతో అధికారులు సీరియస్ అవుతూ మాల్ యజమానికి రూ. 50 వేల జరిమానా విధించారు.

Tags:    

Similar News