కేకేఆర్ చెత్త ఇన్నింగ్స్.. ముంబైని గెలిపించిన ఆ ఇద్దరు

దిశ, వెబ్‌డెస్క్: ఐపీఎల్ సీజన్ 14లో ‘డిఫెండింగ్ చాంపియన్’ ముంబై ఇండియన్స్ ఒకటో మ్యాచ్ ఆనవాయితీగా ఓడిపోయినా.. రెండో మ్యాచ్‌లో మాత్రం తిరిగి పుంజుకుంది. ఎంఏ చిదంబరం స్టేడియం వేదికగా జరిగిన ఐపీఎల్ ఐదో మ్యాచ్‌లో స్వల్ప స్కోరు(152) నమోదు చేసిన ముంబై ఇండియన్స్‌.. కోల్‌కతా‌ను కూడా తక్కువ పరుగులకే కుప్పకూల్చింది. 153 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన మోర్గాన్ టీమ్ 142 పరుగుల చేసి చేతులెత్తేశారు. ఈ క్రమంలోనే 10 పరుగుల తేడాతో ముంబై విజయం […]

Update: 2021-04-13 12:33 GMT

దిశ, వెబ్‌డెస్క్: ఐపీఎల్ సీజన్ 14లో ‘డిఫెండింగ్ చాంపియన్’ ముంబై ఇండియన్స్ ఒకటో మ్యాచ్ ఆనవాయితీగా ఓడిపోయినా.. రెండో మ్యాచ్‌లో మాత్రం తిరిగి పుంజుకుంది. ఎంఏ చిదంబరం స్టేడియం వేదికగా జరిగిన ఐపీఎల్ ఐదో మ్యాచ్‌లో స్వల్ప స్కోరు(152) నమోదు చేసిన ముంబై ఇండియన్స్‌.. కోల్‌కతా‌ను కూడా తక్కువ పరుగులకే కుప్పకూల్చింది. 153 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన మోర్గాన్ టీమ్ 142 పరుగుల చేసి చేతులెత్తేశారు. ఈ క్రమంలోనే 10 పరుగుల తేడాతో ముంబై విజయం సాధించింది.

కోల్‌కతా ఇన్నింగ్స్:

ఓపెనర్లు నితీష్ రానా (57), శుభ్‌మన్ గిల్ (33) ఛేదనలో కీలక పాత్ర పోషించారు. కానీ, మిగతా బ్యాట్స్‌మెన్లు రాహుల్ త్రిపాఠి (5), ఇయాన్ మోర్గాన్ (7) షకీబ్ అల్ హసన్ (9) దారుణంగా విఫలమయ్యారు. ఈ పరిణామాలతో 122 పరుగుల వద్ద కేకేఆర్‌ 5 వికెట్లు కోల్పోయింది. ఆ తర్వాత వచ్చిన దీనేష్ కార్తీక్, ఆండ్రూ రస్సెల్ చివరి నిమిషంలో చేతులెత్తేశారు. టెస్టు మ్యాచ్‌ ఆడినట్టు బ్యాటింగ్ ప్రదర్శన చేసి జట్టును పీకల్లోతు కష్టాల్లోకి నెట్టారు.

ఇక 20వ ఓవర్‌లో బౌలింగ్ వేసిన బోల్ట్ ( రస్సెల్ 8, కమ్మిన్స్ 0) వికెట్లు తీసుకొని ముంబైని విజయతీరాలకు చేర్చాడు. ఆ తర్వాత క్రీజులో హర్బజన్, దినేష్ కార్తీక్ ఉన్న ప్రయోజనం లేకుండా పోయింది. మిడిలార్డర్ పూర్తిగా విఫలం అవడంతో 7 వికెట్లు నష్టపోయిన కేకేఆర్ 142 పరుగులు మాత్రమే చేసి ఓటమిని ముటగట్టుకుంది. ఇక ముంబై ఇండియన్స్‌లో రాహుల్ చాహర్ 4 వికెట్లు, బోల్ట్ 2 వికెట్లు తీసుకున్నారు.

ముంబై ఇన్నింగ్స్:

తొలుత టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ముంబై బ్యాట్స్‌మెన్లు తడబడ్డారు. ఓపెనర్ రోహిత్ శర్మ (43), సూర్యకుమార్ యాదవ్ (56) రాణించినా.. మిగతా బ్యాట్స్‌మెన్లు పూర్తిగా విఫలమయ్యారు. రోహిత్ 33 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్సర్ కొట్టగా.. సూర్య కుమార్ 36 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్సర్ల మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. కానీ, కీలక బ్యాట్స్‌మెన్లు అయిన డీకాక్(2), ఇషాన్ కిషన్(1), హార్దిక్ పాండ్యా(15) పొలార్డ్ (5), పరుగులు మాత్రమే చేసి వెనుదిరిగారు. ఇక లోయర్ ఆర్డర్‌లో వచ్చిన మార్కో జాన్సెస్ డకౌట్ కావడంతో.. 126 పరుగుల వద్ద ముంబై 7 వికెట్లను నష్టపోయింది. ఆ తర్వాత డెత్ ఓవర్లలో కృనాల్ పాండ్యా (15), రాహుల్ చాహర్ (6), బుమ్రా డకౌట్ కావడంతో ముంబై ఇండియన్ 20 ఓవర్ చివరి బంతికి ఆలౌట్ అయింది. దీంతో ముంబై ఇండియన్స్ కేవలం 152 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఇక 153 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన కోల్‌కతా 142 పరుగులకే కుప్పకూలడం దారుణం.

Tags:    

Similar News