ముంబై జోరు.. కుప్పకూలిన రైడర్లు

దిశ, వెబ్‌డెస్క్: చెన్నై సూపర్ కింగ్స్‌తో తొలి మ్యాచ్‌లో ఓటమి చవిచూసిన ముంబై ఇండియన్స్.. రెండో మ్యాచ్‌లో చెలరేగిపోయింది. కెప్టెన్ రోహిత్ శర్మ (80) అద్భుత ఇన్నింగ్స్, సూర్యకుమార్ యాదవ్ (47) తీసిపోని భాగస్వామ్యంతో ముంబైకి‌ ప్లస్ పాయింట్ అయ్యాయి. దీంతో ముంబై ఇండియన్స్ 195/5 (20)పరుగులు చేయగలిగారు. ముంబయి జట్టులో  కెప్టెన్ రోహిత్ శర్మకు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ దక్కింది. కోల్‌కతాకు 196 పరుగుల భారీ టార్గెట్ ఇచ్చిన ముంబై.. జట్టు చివరకి ఘన […]

Update: 2020-09-23 13:24 GMT

దిశ, వెబ్‌డెస్క్: చెన్నై సూపర్ కింగ్స్‌తో తొలి మ్యాచ్‌లో ఓటమి చవిచూసిన ముంబై ఇండియన్స్.. రెండో మ్యాచ్‌లో చెలరేగిపోయింది. కెప్టెన్ రోహిత్ శర్మ (80) అద్భుత ఇన్నింగ్స్, సూర్యకుమార్ యాదవ్ (47) తీసిపోని భాగస్వామ్యంతో ముంబైకి‌ ప్లస్ పాయింట్ అయ్యాయి. దీంతో ముంబై ఇండియన్స్ 195/5 (20)పరుగులు చేయగలిగారు. ముంబయి జట్టులో కెప్టెన్ రోహిత్ శర్మకు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ దక్కింది.

కోల్‌కతాకు 196 పరుగుల భారీ టార్గెట్ ఇచ్చిన ముంబై.. జట్టు చివరకి ఘన విజయం సాధించింది. ముంబై బౌలర్లు వేసిన పదునైన బంతులకు రైడర్లు చేతులేత్తేశారు. తొలి ఓవర్ మేడ్‌ ఇన్‌తో శుభారంభం ఇచ్చి అదే జోరు కొనసాగించిన ముంబై బౌలర్లు.. కేకేఆర్ బ్యాట్స్‌మెన్లను కట్టడి చేశారు. లక్ష్య ఛేదనలో 20 ఓవర్లలో 146/9 పరుగలకే రైడర్లు పరిమితమయ్యారు.

సెకండ్ ఇన్నింగ్స్:
భారీ లక్ష్యంతో బరిలో దిగిన కేకేఆర్ (KKR) జట్టు ఆదిలోనే తీవ్ర ఒత్తిడికి లోనైంది. టాప్ ఆర్డర్‌లో వచ్చిన యువబ్యాట్స్‌మెన్‌ శుబ్‌మన్ గిల్.. ట్రెంట్‌ బౌల్ట్ వేసిన తొలి ఓవర్‌ మేడ్ ఇన్‌ ఇవ్వడంతో ముంబై (MI) బౌలర్లు జోరు పెంచారు. ఇదే జోరు కొనసాగిస్తూ సరిగ్గా 14 పరుగుల వద్ద శుబ్‌మన్ గిల్‌ కేవలం (7) పరుగులు చేసి బౌల్ట్ బౌలింగ్‌లోనే పొలార్డ్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ బాట పట్టాడు. ఆ తర్వాత 25 పరుగుల వద్ద హిట్టర్ సునీల్ నరైన్(9) ప్యాటిన్సన్‌ ఓవర్‌లో డీకాక్‌కు క్యాచ్ ఇచ్చి శుబ్ మన్ గిల్ బాట పట్టాడు. దీంతో 25 పరుగులకే కోల్‌కతా (KKR) ఇద్దరు రైడర్లను కోల్పోయింది.

ఓపెనర్లను కోల్పోయిన కేకేఆర్ (KKR) జట్టుకు కెప్టెన్ దినేశ్ కార్తీక్ కాస్తా ఊరటనిస్తూ క్రీజులో కుదురుకున్నాడు. దినేష్ కార్తీక్‌కు తోడుగా నితీష్ రానా మంచి భాగస్వామ్యం అందిస్తున్న సమయంలోనే.. వీరిద్దరి పార్ట్‌నర్ షిప్‌కు.. ముంబై (MI) స్పిన్నర్ రాహుల్ చాహర్ బ్రేక్ వేశాడు. కెప్టెన్ దినేశ్ కార్తీక్‌ను (30) lbwతో ఔట్ చేసి పెవిలియన్ పంపాడు. ఆ తర్వాత బరిలోకి దిగిన ఇయాన్ మోర్గాన్‌కు నితీష్ రానా భాగస్వామ్యం అందిస్తాడనుకున్నా.. పోలార్డ్ వేసిన బంతికి భారీ షాట్ ఆడబోయి హార్దిక్ పాండ్యా చేతికి క్యాచ్ ఇచ్చాడు. దీంతో 77 పరుగుల వద్ద నితీష్ రానా (24) ఔట్ అయ్యాడు.

ఇక మిడిలార్డర్‌లో దిగిన సంచలన బ్యాట్స్‌మెన్ ఆండ్రూ రస్సెల్ పై అభిమానుల ఆశలు అంత ఇంతా కాదు. చివరికి కేకేఆర్ ఆశల పై కూడా యార్కర్ వీరుడు జస్ప్రీత్ బుమ్రా నీళ్లు చల్లాడు. తన పదునైన యార్కర్‌ బంతులను సంధించి.. ఆండ్రూ రస్సెల్‌ (11) వికెట్ పడగొట్టాడు. దీంతో 100 పరుగులకే కోల్‌కతా నైట్ రైడర్స్ 5 వికెట్లను కోల్పోయింది. ఇక బుమ్రా వేసిన అదే ఓవర్‌లో లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్‌మెన్ ఇయాన్ మోర్గాన్ (16) కూడా 101 స్కోర్ వద్ద కీపర్‌కు క్యాచ్ ఇచ్చి చేతులెత్తేశాడు. మోర్గాన్ వికెట్‌తో టాప్ ఆర్డర్ మొత్తాన్ని కోల్పోయిన కోల్‌కతా నైట్ రైడర్స్ పీకల్లోతు కష్టాల్లో పడ్డారు. ఆ తర్వాత వచ్చిన నిఖిల్ నాయక్ ఒక పరుగు మాత్రమే చేసి 103 వద్ద బౌల్ట్ బౌలింగ్‌లో క్యాచ్ ఔట్ అయ్యాడు.

ఇదే సమయంలో లోయర్ ఆర్డర్‌లో వచ్చిన ప్యాట్ కమ్మిన్స్‌ సిక్సుల మోత మోగించి ఐపీఎల్ వైభవాన్ని గుర్తు చేశాడు. ఏకధాటిగా బౌండరీలను పారిస్తూ.. కేకేఆర్‌ జట్టుకు ఆశలు చిగురించేలా చేశాడు. కానీ, చివరకు ప్యాటిన్సన్‌ వేసిన బంతిని బలంగా కొట్టి.. హార్దిక్‌ చేతికి క్యాచ్ ఇచ్చాడు. కేవలం 12 బంతుల్లోనే 33 పరుగులు చేసిన కమ్మిన్స్‌ 141 పరుగుల వద్ద పెవిలియన్ బాట పట్టాడు. ఆ తర్వాత చివరి ఓవర్‌ మిగిలుండగా.. కేకేఆర్‌ 54 పరుగులు చేయడం అసాధ్యమైంది. ఇదే ఓవర్‌లో (9) పరుగులు చేసిన శివం మని 146 వద్ద స్టెంప్ ఔట్ అయ్యాడు. నిర్ధిష్ఠ 20 ఓవర్లలో కేకేఆర్ కేవలం 146/9 పరుగులు మాత్రమే చేయగలిగింది. దీంతో ముంబై విజయం లాంఛనమైంది.

MI తొలి ఇన్నింగ్స్: 195/5 (20)
KKR సెకండ్ ఇన్నింగ్స్: 146/9 (20)

చెలరేగిన ముంబై బౌలర్లు:
బుమ్రా -2 (ఆండ్రూ రస్సెల్, ఇయాన్ మోర్గాన్)
బౌల్ట్ -2 (శుబ్ మన్ గిల్, నిఖిల్ నాయక్)
ప్యాటిన్సన్ -2 (సునీల్ నరైన్, ప్యాట్ కమ్మిన్స్)
రాహుల్ చాహర్ -2(దినేశ్ కార్తీక్, శివం మణి)
పోలార్డ్ -1( నితీష్ రానా)

పాయింట్స్ టేబుల్

జట్టు మ్యాచ్‌లు గెలిచినవి ఓడినవి పాయింట్లు నెట్ రన్‌రేట్

ముంబయి 2 1 1 2 +0.993

రాజస్థాన్ 1 1 0 2 +0.800

బెంగళూరు 1 1 0 2 +0 500

ఢిల్లీ 1 1 0 2 +0.000

చెన్నై 2 1 1 2 -0.145

పంజాబ్ 1 0 1 0 + .000

హైదరాబాద్ 1 0 1 0 -0.500

కోల్‌కతా 1 0 1 0 -2.450

స్కోర్ బోర్డ్

ముంబయి ఇండియన్స్: డి కాక్ (సి) నాయక్ (బి) శివమ్ మావి 1, రోహిత్ శర్మ (సి) కమిన్స్ (బి) శివమ్ మావి 80, సూర్యకుమార్ యాదవ్ రనౌట్(నరైన్/ మోర్గాన్) 47, సౌరభ్ తివారి (సి) కమిన్స్ (బి) నరైన్ 21, హార్దిక్ పాండ్యా హిట్ వికెట్ (బి) 18, కేఏ పొలార్డ్ నాటౌట్ 13, కృనాల్ పాండ్యా నాటౌట్ 1; ఎక్స్‌ట్రాలు 14 మొత్తం 195/5

వికెట్ల పతనం: 1-8, 2-98, 3-147, 4-177, 5-180

బౌలింగ్: ఎస్ సందీప్ కుమార్ 3-0-34-0, శివమ్ మావి 4-1-32-2, పీజే కమిన్స్ 3-0-49-0, నరైన్ 4-0-22-1, ఆండ్రీ రస్సెల్ 2-0-17-1, కుల్దీప్ యాదవ్ 4-0-39-0

కోల్‌కతా నైట్‌రైడర్స్:
శుభమన్ గిల్ (సి) పొలార్డ్ (బి) బోల్ట్ 7, నరైన్ (సి) డి కాక్ (బి) ప్యాటిన్సన్ 9, దినేశ్ కార్తీక్ ఎల్‌బీడబ్ల్యూ (బి) చహర్ 30, ఎన్ రాణా (సి) హార్దిక్ పాండ్యా (బి) పొలార్డ్ 24, మోర్గాన్ (సి) డి కాక్ (బి) బుమ్రా 16, ఆండ్రీ రస్సెల్ (బి) బుమ్రా 11, ఎన్‌ఎస్ నాయక్ (సి) హార్దిక్ పాండ్యా (బి) బోల్ట్ 1, కమిన్స్ (సి) హార్దిక్ పాండ్యా (బి) ప్యాటిన్సన్ 33, శివమ్ మావి (సి) డి కాక్ (బి) చహర్ 9, కుల్దీప్ యాదవ్ నాటౌట్ 1; ఎక్స్‌ట్రాలు 5 మొత్తం 146/9

వికెట్ పతనం: 1-14, 2-25, 3-71, 4-77, 5-100, 6-101, 7-103, 8-141, 9-146

బౌలింగ్: బౌల్ట్ 4-1-30-2, ప్యాటిన్సన్ 4-0-25-2, బుమ్రా 4-0-32-2, చహర్ 4-0-26-2, పొలార్డ్ 3-0-21-1, హార్దిక్ పాండ్యా 1-0-10-0

Tags:    

Similar News