ఆ స్టార్ ఆల్‌రౌండర్‌ను పక్కన పెట్టనున్న ముంబై..!

దిశ, వెబ్‌డెస్క్ : IPL-2022లో భాగంగా ఆటగాళ్ల రిటెన్షన్ విధానంతో దాదాపు అన్ని జట్లల్లోనూ కొత్త ముఖాలు కనిపించనున్నట్టు తెలుస్తోంది. కొత్త రిటెన్షన్ పాలసీ ప్రకారం మెగా ఆక్షన్‌ను నిర్వహించడానికి ముందే పాత జట్లు నలుగురి ఆటగాళ్లను రిటైన్ చేసుకునే వీలు లభించింది. ఈ నలుగురిలో ముగ్గురు భారత ఆటగాళ్లు, ఒక విదేశీ ప్లేయర్/ఇద్దరు ఇండియన్ ప్లేయర్లు లేదా ఇద్దరు విదేశీ క్రికెటర్లను సెలెక్ట్ చేసుకోవచ్చు. IPL 2022 సీజన్ కోసం BCCI ఇప్పటి నుంచే కసరత్తు […]

Update: 2021-10-29 10:30 GMT

దిశ, వెబ్‌డెస్క్ : IPL-2022లో భాగంగా ఆటగాళ్ల రిటెన్షన్ విధానంతో దాదాపు అన్ని జట్లల్లోనూ కొత్త ముఖాలు కనిపించనున్నట్టు తెలుస్తోంది. కొత్త రిటెన్షన్ పాలసీ ప్రకారం మెగా ఆక్షన్‌ను నిర్వహించడానికి ముందే పాత జట్లు నలుగురి ఆటగాళ్లను రిటైన్ చేసుకునే వీలు లభించింది. ఈ నలుగురిలో ముగ్గురు భారత ఆటగాళ్లు, ఒక విదేశీ ప్లేయర్/ఇద్దరు ఇండియన్ ప్లేయర్లు లేదా ఇద్దరు విదేశీ క్రికెటర్లను సెలెక్ట్ చేసుకోవచ్చు.

IPL 2022 సీజన్ కోసం BCCI ఇప్పటి నుంచే కసరత్తు ప్రారంభించింది. ఇప్పటికే రెండు కొత్త జట్లను ఖరారు చేయగా.. ఇక ఆటగాళ్ల రిటెన్షన్ విధానంపై పలు సూచనలను పరిగణలోకి తీసుకొని నిబంధనలను ప్రకటించింది. ఐదుసార్లు ఛాంపియన్‌గా నిలిచిన ముంబై ఇండియన్స్‌ మాత్రం ఈ ఏడాది సరిగ్గా రాణించలేదు. దీంతో ఆ జట్టు యజామాన్యం ఆటగాళ్ల పై దృష్టి పెట్టింది. అయితే, కొంతకాలంగా ఫామ్‌ను కోల్పోయిన ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యాను ముంబై ఇండియన్స్ వదిలించుకుంటుందనే టాక్ వినిపిస్తోంది. ఈ మధ్యకాలంలో ఆల్‌రౌండర్ హోదాను కోల్పోయి బౌలింగ్ చేయకుండా కేవలం బ్యాటింగ్ మీదే ఆధారపడుతున్నాడు హార్దిక్ పాండ్యా..

దేశీయ ప్లేయర్ల కోటాలో సూర్యకుమార్ యాదవ్, ఇషాన్ కిషన్‌, ఓవర్సీస్ ఆటగాళ్లలో కీరన్ పొలార్డ్‌ను కొనసాగించడం ఖాయంగా కనిపిస్తోంది. హార్దిక్ పాండ్యాలాగా సూర్యకుమార్ యాదవ్ గానీ, ఇషాన్ కిషన్ గానీ ఆల్‌రౌండర్లు కాదు. కీరన్ పొలార్డ్ ఈ హోదాలో కొనసాగుతాడు. దీంతో దాదాపు, హార్దిక్ పాండ్యాను వదిలించుకోవడానికి ముంబై ఇండియన్స్ మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది.

Tags:    

Similar News