గాయపడ్డ బోల్ట్.. భంగపడ్డ ముంబై?

దిశ, స్పోర్ట్స్: ఐపీఎల్‌ ఫైనల్స్‌లో 6వ సారి ప్రవేశించిన ముంబయి ఇండియన్స్ జట్టు తమ టైటిల్ నిలబెట్టుకోవడానికి మరో విజయం దూరంలో ఉన్నది. బ్యాటింగ్, బౌలింగ్‌లో సమతుల్యంగా ఉన్న ముంబయి జట్టును ఇప్పుడు పేసర్ ట్రెంట్ బౌల్ట్ గాయం ఆందోళన కలిగిస్తున్నది. ఢిల్లీతో జరిగిన తొలి క్వాలిఫయర్‌లో తొలి ఓవర్లోనే రెండు వికెట్లు తీశాడు. రెండో ఓవర్ వేసిన తర్వాత అతడు బౌలింగ్ చేయలేదు. గజ్జల్లో గాయం కారణంగా 14వ ఓవర్ తర్వాత పెవిలియన్‌కు వెళ్లిన బౌల్ట్ […]

Update: 2020-11-08 09:23 GMT

దిశ, స్పోర్ట్స్: ఐపీఎల్‌ ఫైనల్స్‌లో 6వ సారి ప్రవేశించిన ముంబయి ఇండియన్స్ జట్టు తమ టైటిల్ నిలబెట్టుకోవడానికి మరో విజయం దూరంలో ఉన్నది. బ్యాటింగ్, బౌలింగ్‌లో సమతుల్యంగా ఉన్న ముంబయి జట్టును ఇప్పుడు పేసర్ ట్రెంట్ బౌల్ట్ గాయం ఆందోళన కలిగిస్తున్నది. ఢిల్లీతో జరిగిన తొలి క్వాలిఫయర్‌లో తొలి ఓవర్లోనే రెండు వికెట్లు తీశాడు. రెండో ఓవర్ వేసిన తర్వాత అతడు బౌలింగ్ చేయలేదు. గజ్జల్లో గాయం కారణంగా 14వ ఓవర్ తర్వాత పెవిలియన్‌కు వెళ్లిన బౌల్ట్ తిరిగి రాలేదు. అతడి గాయం ఇంకా పూర్తిగా మానకపోవడంతో ఈ నెల 10న జరిగే ఫైనల్స్‌లో ఆడతాడా లేదా అనే అనుమానాలు నెలకొన్నాయి. ఈ సీజన్‌లో ముంబయి జట్టుకు కీలకమైన ఓపెనింగ్ బౌలర్‌గా మారిన బౌల్ట్ లేకుంటే ముంబయి జట్టు చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. అయితే మంగళవారం లోపు బౌల్ట్ కోలుకొని ఫైనల్స్‌కు అందుబాటులో ఉంటాడని కెప్టెన్ రోహిత్ శర్మ ఆశాభావం వ్యక్తం చేశాడు.

Tags:    

Similar News