ముంబైలోనే అర్జున్ టెండుల్కర్.. ధర రూ. 20 లక్షలు
దిశ, స్పోర్ట్స్ : దిగ్గజ క్రికెటర్ సచిన్ టెండుల్కర్ కుమారుడు అర్జున్ టెండుల్కర్‌ను ముంబయి ఇండియన్స్ జట్టు కొనుగోలు చేసింది. గురువారం జరిగిన ఐపీఎల్ మినీ వేలంలో రూ. 20 లక్షల కనీస ధరకు అతడు అమ్ముడుపోయారు. ఐపీఎల్ వేలంలో ఆల్‌రౌండర్‌గా నమోదు చేసుకున్న అర్జున్‌కు బీసీసీఐ రూ. 20 లక్షల కనీస ధర కేటాయించింది. వేలంలో ఆఖరి క్రికెటర్‌గా వచ్చిన అర్జున్‌ను ముంబయి క్రికెట్ డైరెక్టర్ జహీర్ ఖాన్ కనీస ధరకే కొనుగోలు చేశాడు. ఎలాగో […]
దిశ, స్పోర్ట్స్ : దిగ్గజ క్రికెటర్ సచిన్ టెండుల్కర్ కుమారుడు అర్జున్ టెండుల్కర్‌ను ముంబయి ఇండియన్స్ జట్టు కొనుగోలు చేసింది. గురువారం జరిగిన ఐపీఎల్ మినీ వేలంలో రూ. 20 లక్షల కనీస ధరకు అతడు అమ్ముడుపోయారు. ఐపీఎల్ వేలంలో ఆల్‌రౌండర్‌గా నమోదు చేసుకున్న అర్జున్‌కు బీసీసీఐ రూ. 20 లక్షల కనీస ధర కేటాయించింది. వేలంలో ఆఖరి క్రికెటర్‌గా వచ్చిన అర్జున్‌ను ముంబయి క్రికెట్ డైరెక్టర్ జహీర్ ఖాన్ కనీస ధరకే కొనుగోలు చేశాడు. ఎలాగో అర్జున్‌ను ముంబయి కొనుగోలు చేస్తుందని ఊహించిన మిగతా ఫ్రాంచైజీలు వారివైపే చూశారు. దీంతో జహీర్ ఖాన్ అతడి కోసం చెయ్యి లేపాడు. అర్జన్ టెండుల్కర్ అమ్ముడు పోయిన తర్వాత వేలం పాట ముగియడం గమనార్హం. కాగా, విజయ్ హజారే ట్రోఫీకి సంబంధించి ముంబయి రంజీ జట్టులో చోటు దక్కించుకోలేక పోయిన అర్జున్.. ఐపీఎల్‌లో అమ్ముడు పోవడం ఊరగకల్గించే విషయం. అర్జున్ గత కొన్ని సీజన్లుగా ముంబయి ఇండియన్స్ జట్టు నెట్ బౌలర్‌గా ఉన్నాడు.