కోర్టును ఆశ్రయించిన ముంబై దాడుల బాధితురాలు 

దిశ, వెబ్ డెస్క్: ముంబై దాడుల్లో ప్రత్యక్ష సాక్షి, బాధితురాలు అయిన 21 ఏళ్ళ దేవిక రోటవన్ ఆదివారం ముంబై హైకోర్టును ఆశ్రయించింది. ఆర్ధికంగా బలహీన వర్గాల వారి కోటాలో తనకి విద్య, వసతి కల్పించాల్సిందిగా న్యాయస్థానానికి విజ్ఞప్తి చేసింది. ఇప్పుడు తమ కుటుంబాన్ని ఆదుకోకపోతే బాంద్రాలో వారు ఉంటున్న ఫ్లాట్ కి అద్దె కట్టుకోలేక రోడ్డుపైన పడాల్సొస్తుందని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. గత నెలలో తనకోసం ఒక ఇంటిని కేటాయించవలసిందిగా మహారాష్ట్ర ప్రభుత్వానికి లేఖ కూడా రాసినట్టు తెలిపిన ఆమె… ఉగ్రవాద బాధితుల పునరావాసం కోసం నిర్దిష్ట చట్టం లేదంటూ […]

Update: 2020-08-24 11:44 GMT

దిశ, వెబ్ డెస్క్: ముంబై దాడుల్లో ప్రత్యక్ష సాక్షి, బాధితురాలు అయిన 21 ఏళ్ళ దేవిక రోటవన్ ఆదివారం ముంబై హైకోర్టును ఆశ్రయించింది. ఆర్ధికంగా బలహీన వర్గాల వారి కోటాలో తనకి విద్య, వసతి కల్పించాల్సిందిగా న్యాయస్థానానికి విజ్ఞప్తి చేసింది. ఇప్పుడు తమ కుటుంబాన్ని ఆదుకోకపోతే బాంద్రాలో వారు ఉంటున్న ఫ్లాట్ కి అద్దె కట్టుకోలేక రోడ్డుపైన పడాల్సొస్తుందని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది.

గత నెలలో తనకోసం ఒక ఇంటిని కేటాయించవలసిందిగా మహారాష్ట్ర ప్రభుత్వానికి లేఖ కూడా రాసినట్టు తెలిపిన ఆమె… ఉగ్రవాద బాధితుల పునరావాసం కోసం నిర్దిష్ట చట్టం లేదంటూ పిటిషన్ లో పేర్కొంది. ఇలాంటి కేసుల్లో నష్ట పరిహారం ఇచ్చి చేతులు దులిపేసుకోకుండా… బాధితులకు పునరావాసం, ఆరోగ్య సహాయం, విద్యా సహకారం అందించే చట్టాలుండాలని ఆమె అభిప్రాయపడింది.

2008, నవంబరు 26 న ఛత్రపతి శివాజీ మహారాజ్ టెర్మినస్ లో ఉగ్రవాది మొహమ్మద్ అజ్మల్ కసబ్ జరిపిన కాల్పుల్లో పదేళ్ల దేవిక కుడి కాలులో తూటా చొచ్చుకెళ్లింది. 6 సర్జరీలు, 6 నెలల బెడ్ రెస్ట్ తర్వాత రికవర్ అయింది దేవిక. ఈ ఘటనలో గాయపడిన తన సోదరుడికి సైతం వెన్నెముకకు 3 సర్జరీలు అయినట్టు తెలిపింది. ఆసుపత్రి బిల్లులు కట్టడానికే తమ తల్లిదండ్రుల సంపాదన మొత్తం ఖర్చు అయిపోతోందని, ప్రభుత్వం ఆదుకోవాలని కోరుకుంటోంది.

దేవిక ఇటీవలె చేతన డిగ్రీ కాలేజీలో ఆర్ట్స్ కోర్సులో జాయిన్ అయినట్టు తెలిపింది. సివిల్ సర్వీసెస్ లో జాయిన్ అవడం తన యాంబిషన్ అంటోంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం తమని ఆర్ధికంగా ఆదుకుని పై చదువులు చదువుకునే అవకాశంతో పాటు, ఉండటానికి ఇల్లు, వైద్య సహకారం అందించాలని వేడుకుంటోంది.

Tags:    

Similar News