జీవీకే గ్రూప్ ఆఫ్ కంపెనీస్ ఛైర్మన్‌పై సీబీఐ కేసు
దిశ, వెబ్‌డెస్క్: జీవీకే గ్రూప్ ఆఫ్ కంపెనీస్ ఛైర్మన్ గునుపాటి వెంకట కృష్ణారెడ్డి, అతని కుమారుడు, ముంబై ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ లిమిటెడ్ (ఎంఐఏఎల్) మేనేజింగ్ డైరెక్టర్ సంజయ్ రెడ్డిలపై సీబీఐ కేసును నమోదు చేసింది. విమానాశ్రయం అథారిటీ ఆఫ్ ఇండియా, జీవీకే ఎయిర్‌పోర్ట్ హోల్డింగ్స్ లిమిటెడ్‌తో కలిసి జాయింట్ వెంచర్‌ను ఏర్పాటు చేసింది. ముంబై అంతర్జాతీయ విమానాశ్రయం అభివృద్ధికి, నిర్వహణకు ప్రభుత్వ, ప్రైవేట్ భాగస్వామ్య కంపెనీ ఎంఐఏఎల్‌తో ఒప్పందం చేసుకుంది. ఈ క్రమంలోనే 2017-18 ఆర్థిక సంవత్సరంలో […]
దిశ, వెబ్‌డెస్క్: జీవీకే గ్రూప్ ఆఫ్ కంపెనీస్ ఛైర్మన్ గునుపాటి వెంకట కృష్ణారెడ్డి, అతని కుమారుడు, ముంబై ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ లిమిటెడ్ (ఎంఐఏఎల్) మేనేజింగ్ డైరెక్టర్ సంజయ్ రెడ్డిలపై సీబీఐ కేసును నమోదు చేసింది. విమానాశ్రయం అథారిటీ ఆఫ్ ఇండియా, జీవీకే ఎయిర్‌పోర్ట్ హోల్డింగ్స్ లిమిటెడ్‌తో కలిసి జాయింట్ వెంచర్‌ను ఏర్పాటు చేసింది. ముంబై అంతర్జాతీయ విమానాశ్రయం అభివృద్ధికి, నిర్వహణకు ప్రభుత్వ, ప్రైవేట్ భాగస్వామ్య కంపెనీ ఎంఐఏఎల్‌తో ఒప్పందం చేసుకుంది. ఈ క్రమంలోనే 2017-18 ఆర్థిక సంవత్సరంలో మొత్తం తొమ్మిది కంపెనీలకు బోగస్ కాంట్రాక్టులు ఇచ్చినట్టుగా చూపించి రూ. 310 కోట్ల అక్రమాలకు పాల్పడినట్టు సీబీఐ ఆరోపణలు చేసింది. ఎంఐఏఎల్ రిజర్వ్ ఫండ్ రూ. 395 కోట్లను జీవీకే ప్రమోటర్లు తమ గ్రూప్ కంపెనీలకు ఆర్థిక సాయం చేసేందుకు దుర్వినియోగం చేశారని సీబీఐ పేర్కొంది. జీవీకే గ్రూప్ ఛైర్మన్ వెంకట కృష్ణారెడ్డి, అతని కుమారుడు సంజయ్‌తో పాటు ఎంఐఏఎల్, జీవీకే ఎయిర్‌పోర్ట్ హోల్డింగ్స్, మరో తొమ్మిది కంపెనీలు, ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాకు చెందిన అధికారులపై సీబీఐ కేసును నమోదు చేసింది.