రాష్ట్రంలో మహిళలకు రక్షణేది : సీతక్క

దిశ, వెబ్‌డెస్క్ : తెలంగాణ రాష్ట్రంలో మహిళల పరిస్థితి అత్యంత దారుణంగా తయారైందని ములుగు నియోజకవర్గ ఎమ్మెల్యే సీతక్క విమర్శించారు. 139 మంది తనపై అత్యాచారం చేశారని ఓ దళిత మహిళ పంజాగుట్ట పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా, ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం దారుణమని ప్రశ్నించారు. రాష్ట్రంలో మహిళలకు రక్షణ అనేదే లేకుండా పోయిందని ఆమె ఆవేదన వ్యక్తంచేశారు. ఈ కేసులో సీఐడీ సమగ్ర విచారణ చేపట్టాలని ఆమె డిమాండ్ చేశారు. నిజాలను నిగ్గుతేల్చి దోషులను కఠినంగా […]

Update: 2020-08-29 07:14 GMT

దిశ, వెబ్‌డెస్క్ : తెలంగాణ రాష్ట్రంలో మహిళల పరిస్థితి అత్యంత దారుణంగా తయారైందని ములుగు నియోజకవర్గ ఎమ్మెల్యే సీతక్క విమర్శించారు. 139 మంది తనపై అత్యాచారం చేశారని ఓ దళిత మహిళ పంజాగుట్ట పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా, ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం దారుణమని ప్రశ్నించారు. రాష్ట్రంలో మహిళలకు రక్షణ అనేదే లేకుండా పోయిందని ఆమె ఆవేదన వ్యక్తంచేశారు.

ఈ కేసులో సీఐడీ సమగ్ర విచారణ చేపట్టాలని ఆమె డిమాండ్ చేశారు. నిజాలను నిగ్గుతేల్చి దోషులను కఠినంగా శిక్షించాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ కేసులో పెద్దల హస్తముందని పలు కథనాలు వెలువడుతున్నాయని.. వారు ఎంతటి వారైనా ఉపేక్షించకూడదని సీతక్క తెలిపారు.

Tags:    

Similar News