అక్కడ డెంగీ టెస్టులు చేస్తే.. జైలు శిక్ష

దిశ, ములుగు: జిల్లాలోని ప్రైవేట్ క్లినిక్‌లలో డెంగీ నిర్ధారణ పరీక్షలు చేస్తే క్లినికల్ యాక్ట్ ప్రకారం జైలు శిక్ష తప్పదని ములుగు జిల్లా వైద్యాధికారి డాక్టర్ అల్లెం అప్పయ్య హెచ్చరించారు. సోమవారం జిల్లా కేంద్రంలోని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ… జిల్లాలోని ప్రైవేట్ క్లినిక్‌లు, ఆర్ఎంపీ డాక్టర్లు జ్వరంతో రోగులు తమ వద్దకు వస్తే వారికి అనవసర పరీక్షలు చేసి, డబ్బులు వసూల చేస్తున్నట్లుగా తమకు సమాచారం వచ్చిందని, అర్థంపర్థం లేని […]

Update: 2021-08-23 08:55 GMT

దిశ, ములుగు: జిల్లాలోని ప్రైవేట్ క్లినిక్‌లలో డెంగీ నిర్ధారణ పరీక్షలు చేస్తే క్లినికల్ యాక్ట్ ప్రకారం జైలు శిక్ష తప్పదని ములుగు జిల్లా వైద్యాధికారి డాక్టర్ అల్లెం అప్పయ్య హెచ్చరించారు. సోమవారం జిల్లా కేంద్రంలోని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ… జిల్లాలోని ప్రైవేట్ క్లినిక్‌లు, ఆర్ఎంపీ డాక్టర్లు జ్వరంతో రోగులు తమ వద్దకు వస్తే వారికి అనవసర పరీక్షలు చేసి, డబ్బులు వసూల చేస్తున్నట్లుగా తమకు సమాచారం వచ్చిందని, అర్థంపర్థం లేని పరీక్షలు నిర్వహించి డెంగీ వ్యాధిగా నిర్ధారణ చేస్తున్నారని మండిపడ్డారు. తప్పుడు నిర్ణయాలతో ప్రజలను అయోమయానికి గురిచేస్తున్నారని తెలిసిందన్నారు. జిల్లా కేంద్రంలోని ములుగు ఏరియా ఆస్పత్రిలోని తెలంగాణ డయాగ్నస్టిక్ హబ్‌లో డెంగీ నిర్ధారణ, ఎలీషా టెస్టులు చేస్తున్నారని సూచించారు.

అందరూ ఇక్కడే డెంగీ టెస్టులు చేయించుకోవాలని, ప్రైవేటు, ఆర్ఎంపీ డాక్టర్లను సంప్రదించొద్దని, వారి మాయమాటలు విని భయాందోళన చెందకూడదని తెలిపారు. ప్రైవేట్ క్లినిక్‌లలో డెంగీ నిర్ధారణ పరీక్షలు చేసిన వారిపై కేసు నమోదు చేయడంతో పాటు క్లినికల్ యాక్ట్ ప్రకారం.. జైలు శిక్ష పడేలా చేస్తామని హెచ్చరించారు. అంతేగాకుండా.. కొంతమంది ప్రైవేటు క్లినిక్ వైద్యులు తమ క్లినిక్‌లను రెన్యువల్ చేసుకోవడం లేదని తమ దృష్టికి వచ్చిందని, వారికి పదిరోజుల గడువు ఇస్తున్నామని, ఈ గడువులోపు రిజిస్ట్రేషన్ చేసుకోకపోతే క్లినిక్‌ల రిజిస్ట్రేషన్ రద్దు చేస్తామని హెచ్చరించారు.

Tags:    

Similar News