ద్రవిడ్ నన్ను పెళ్లి చేసుకో.. దివాల్ ను హోటల్ గదిలో నిర్భందించిన యువతి

దిశ,వెబ్‌డెస్క్: ఇండియన్ క్రికెట్ టీంకు ఎన్నో సేవలందించిన మిస్టర్ డిపెండబుల్ రాహుల్ ద్రవిడ్ ను ఎవరూ మరిచిపోలేరు. జట్టుకష్టాల్లో ఉన్నప్పుడు, వరుసగా వికెట్లు కోల్పోతూ ఓటమి అంచుల్లో సతమతమవుతున్నప్పుడు ప్రత్యర్ధి బౌలర్లకు చుక్కలు చూపిస్తూ వికెట్ పడకుండా ఓ గోడగా క్రీజు లో నిలబడేవాడు. అందుకే క్రికెట్ ప్రపంచంలో ద్రవిడ్ ను ‘ది వాల్’ అని పిలుస్తారు. 1996 ఏప్రిల్ 3న శ్రీలంకపై వన్డే మ్యాచ్, అదే ఏడాది జూన్ లో భారత్ – ఇంగ్లాండ్ టెస్ట్ […]

Update: 2021-03-05 09:19 GMT

దిశ,వెబ్‌డెస్క్: ఇండియన్ క్రికెట్ టీంకు ఎన్నో సేవలందించిన మిస్టర్ డిపెండబుల్ రాహుల్ ద్రవిడ్ ను ఎవరూ మరిచిపోలేరు. జట్టుకష్టాల్లో ఉన్నప్పుడు, వరుసగా వికెట్లు కోల్పోతూ ఓటమి అంచుల్లో సతమతమవుతున్నప్పుడు ప్రత్యర్ధి బౌలర్లకు చుక్కలు చూపిస్తూ వికెట్ పడకుండా ఓ గోడగా క్రీజు లో నిలబడేవాడు. అందుకే క్రికెట్ ప్రపంచంలో ద్రవిడ్ ను ‘ది వాల్’ అని పిలుస్తారు. 1996 ఏప్రిల్ 3న శ్రీలంకపై వన్డే మ్యాచ్, అదే ఏడాది జూన్ లో భారత్ – ఇంగ్లాండ్ టెస్ట్ సిరీస్ తో అరంగ్రేటం చేశారు. అయితే తన తొలి టెస్ట్ మ్యాచ్ లో భారత్ తరుపున 7వ స్థానంలో దిగి 95పరుగులు చేసి కేవలం 5పరుగులతో సెంచరీని మిస్ అయ్యాడు. ఆ తరువాత దక్షిణాఫ్రికా టీంతో జరిగిన టెస్ట్ మ్యాచ్ లో 3వ స్థానంలో దిగి తన తొలి టెస్ట్ సెంచరీని నమోదు చేశారు. అలా క్రికెటర్ గా తన కెరియర్ ను ప్రారంభించిన రాహుల్ ద్రవిడ్ ప్రపంచ దేశాల్లో ఉన్న క్రికెట్ అభిమానులు ఇష్టపడే ప్లేయర్ గా క్రమశిక్షణ, సౌమ్యంతో ఒకరకంగా చెప్పాలంటే క్రమశిక్షణ కు మారుపేరుగా నిలిచారు. అలాంటి మిస్టర్ డిపెండబుల్ విదేశంలో సిరీస్ ఆడేందుకు వెళ్లే సమయంలో స్వీట్ షాక్ కు గురయ్యారు. ఆ షాక్ అలాంటి, ఇలాంటి షాక్ కాదు. ఏకంగా ఓ రూమ్ లో బంధించి బ్లాక్ మెయిల్ చేసేంతలా.

సాధారణంగా ఇప్పటికి, ఎప్పటికి ద్రవిడ్ ఇబ్బంది పడ్డ ఫన్నీ ఇన్సిడెంట్ ఏదైనా ఉందంటే అది 2010 సింగపూర్ ఇంటర్వ్యూ అనే చెప్పుకోవాలి. మ్యాచ్ ఆడేందుకు ఇండియన్ క్రికెట్ టీమ్ మనదేశం నుంచి సింగపూర్ మీదిగా విదేశీ టూర్‌కు వెళుతుంది. అయితే ఈ సందర్భంగా సింగపూర్ లో ఉన్న అభిమానుల కోసం ఇంటర్వ్వూ ఇవ్వాలంటూ ఓ మహిళా జర్నలిస్ట్ రాహుల్ ద్రవిడ్ ను కోరింది. అందుకు ద్రవిడ్ యాక్సెప్ట్ చేశాడు. దీంతో సదరు జర్నలిస్ట్ ప్లాన్ ప్రకారం ప్రైవేసీ కోసం ఓ రూమ్ లో ఇంటర్వ్యూ ను అరేంజ్ చేసింది. ఇంటర్వ్యూ మధ్యలో ఇంటర్వ్యూ ఆపేసిన సదరు జర్నలిస్ట్ రాహుల్ ను స్కూల్ వయస్సు నుంచి ఎంతలా ఇష్టపడేదో వివరించింది. ఆపై పెళ్లి చేసుకోవాలని రిక్వెస్ట్ చేసింది. ఆ రిక్వెస్ట్ తో కంగుతిన్న రాహుల్ ఇంటర్వ్యూ రూమ్ నుంచి బయటకు వచ్చేందుకు ప్రయత్నించాడు. అదే సమయంలో రూమ్ బయటే ఉన్న సదరు మహిళా జర్నలిస్ట్ తండ్రి రూమ్ లోకి వచ్చాడు.

రాహుల్ గారు మీరు మా అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని తండ్రి కోరాడు. అందుకు రాహుల్ ద్రవిడ్ తిరస్కరించాడు. అనంతరం రాహుల్ యువతిని , వాళ్ల తండ్రిని కూర్చొబెట్టి మాట్లాడే ప్రయత్నం చేశాడు.

రాహుల్ ద్రవిడ్ : నీ వయస్సు ఎంత?

యువతి: 20 ఏళ్లు

రాహుల్ ద్రవిడ్ : ఓకే మీరు చదువుమీద కాన్సట్రేషన్ చేయడం మంచిది. పెళ్లి గురించి ఆలోచించడం మానేయండి. శ్రద్దగా చదువుకోండి అంటూ సూచించాడు. దీంతో యువతి, ఆమె తండ్రి ఇద్దరూ రాహుల్ ను ఒప్పించేందుకు ప్రయత్నించారు.

కానీ ఇక్కడుంది ది వాల్ కదా. ఎంతో సౌమ్యంగా మీ అమ్మాయిని బాగా చదివించండి అంటూ అక్కడి నుంచి వెళ్లేందుకు ప్రయత్నించాడు. అదే సమయంలో యువతి తండ్రి రాహుల్ ను అక్కడే ఉన్న కుర్చీలో నెట్టి కట్టేందుకు ప్రయత్నించాడు. ఆ ప్రయత్నాల్లో ఉండగా ‘ఎంటీవీ బక్రా’ యాంకర్ సైరస్‌ బ్రోచా ఎంటరయ్యాడు. ఇదంతా ఫ్రాంక్ లో భాగమని ఆ ఇన్సిడెంట్‌కు పులిస్టాప్ పెట్టాడు. చివరికి ఎంటీవీ ప్రాంక్ లో రాహుల్ సదరు మహిళా జర్నలిస్ట్ ను పెళ్లి చేసుకునేందుకు ఒప్పుకుంటాడని అందరూ అనుకున్నారు. కానీ రాహుల్ మాత్రం సౌమ్యంగా తిరస్కరించి సిన్సియారిటీకి కేరాఫ్ అడ్రస్ గా నిలిచారని యాంకర్ సైరస్‌ బ్రోచా ప్రశంసల వర్షం కురిపించారు.

Tags:    

Similar News