రీల్ ధోనీ.. కొన్ని విశేషాలు
దిశ, స్పోర్ట్స్: టీమ్ఇండియా చరిత్రలో అత్యంత విజయవంతమైన కెప్టెన్ ఎంఎస్ ధోనీ జీవిత కథనాన్ని తెరపై పోషించిన బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆదివారం ముంబయిలో ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సినిమాలో అతనికి బదులు మొదట అక్షయ్‌కుమార్‌ని తీసుకోవాలని దర్శకుడు అనుకున్నారట. కానీ, ధోనీ పోలికలు ఎక్కువగా అక్షయ్‌లో కనపడకపోవడంతో సుశాంత్‌ను ఫైనలైజ్ చేశారు. ఈ సినిమా కోసం మాజీ క్రికెటర్ కిరణ్ మోరే దగ్గర సుశాంత్ శిక్షణ పొందాడు. శిక్షణ సమయంలో ఎంఎస్ ధోనీ […]
దిశ, స్పోర్ట్స్: టీమ్ఇండియా చరిత్రలో అత్యంత విజయవంతమైన కెప్టెన్ ఎంఎస్ ధోనీ జీవిత కథనాన్ని తెరపై పోషించిన బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆదివారం ముంబయిలో ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సినిమాలో అతనికి బదులు మొదట అక్షయ్‌కుమార్‌ని తీసుకోవాలని దర్శకుడు అనుకున్నారట. కానీ, ధోనీ పోలికలు ఎక్కువగా అక్షయ్‌లో కనపడకపోవడంతో సుశాంత్‌ను ఫైనలైజ్ చేశారు. ఈ సినిమా కోసం మాజీ క్రికెటర్ కిరణ్ మోరే దగ్గర సుశాంత్ శిక్షణ పొందాడు. శిక్షణ సమయంలో ఎంఎస్ ధోనీ సిగ్నేచర్ మార్క్ ‘హెలికాఫ్టర్ షాట్’ ప్రాక్టీస్ చేస్తూ గాయపడ్డాడు. దాంతో స్వయంగా ధోనీనే సుశాంత్‌కు ఆ షాట్ ఎలా ఆడాలో నేర్పించాడు. ధోనీలా కనపడటానికి సుశాంత్ వ్యాయామాలు చేయడమే కాకుండా జులపాలు కూడా పెంచాడు. ఇక ధోనీ సినిమాలో కనిపించే అన్ని అంతర్జాతీయ మ్యాచ్‌లు కూడా ఒరిజినల్ ఫుటేజీనే. కాకపోతే సినిమాలో ధోనీ బదులు సుశాంత్ కనిపించేలా గ్రాఫిక్స్ చేశారు.