రూ.100 కోట్లకు పైనే ఎమ్మార్వో నాగరాజు ఆస్తులు ?

దిశ, వెబ్‌డెస్క్: రూ. కోటి 10లక్షలు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన కీసర ఎమ్మార్వో నాగరాజు కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. అతని ఆస్తులు రూ.100 కోట్లకు పైగానే ఉన్నట్లు ఏసీబీ అధికారులు అంచనా వేస్తున్నారు. భారీగా లంచాలు తీసుకుంటూ నగర శివార్లలో పెద్ద ఎత్తున ఆస్తులు కొనుగోలు చేసినట్లు అధికారులు గుర్తించారు. శుక్రవారం సాయంత్రం నాగరాజు ఇంట్లో సోదాలు నిర్వహించిన ఏసీబీ అధికారులు రూ.28లక్షల నగదు, 2కిలోల బంగారం స్వాధీనం చేసుకుని, రెండు బ్యాంకుల్లో […]

Update: 2020-08-15 04:39 GMT

దిశ, వెబ్‌డెస్క్: రూ. కోటి 10లక్షలు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన కీసర ఎమ్మార్వో నాగరాజు కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. అతని ఆస్తులు రూ.100 కోట్లకు పైగానే ఉన్నట్లు ఏసీబీ అధికారులు అంచనా వేస్తున్నారు. భారీగా లంచాలు తీసుకుంటూ నగర శివార్లలో పెద్ద ఎత్తున ఆస్తులు కొనుగోలు చేసినట్లు అధికారులు గుర్తించారు. శుక్రవారం సాయంత్రం నాగరాజు ఇంట్లో సోదాలు నిర్వహించిన ఏసీబీ అధికారులు రూ.28లక్షల నగదు, 2కిలోల బంగారం స్వాధీనం చేసుకుని, రెండు బ్యాంకుల్లో ఉన్న లాకర్లను సీజ్ చేశారు.

28ఎకరాల ల్యాండ్ వ్యవహారంలో రూ.కోటికి పైగా లంచం తీసుకుంటూ దొరికిన కీసర ఎమ్మార్వో.. మొదటి నుంచి లంచాలు డిమాండ్ చేస్తూ కోట్లకు పడగలెత్తాడని సమాచారం. కూకట్‌పల్లి నుంచి కొద్దినెలల క్రితం కీసరకు ట్రాన్స్‌ఫర్ అయిన నాగరాజు.. లంచాల కోసం ప్రైవేట్ వ్యక్తులను నియమించుకొని భారీగా అక్రమ సంపాదన కూడబెట్టినట్లు తెలుస్తోంది.

Tags:    

Similar News