స్ట్రెచర్‌పై వచ్చి ఓటేసిన ఎంపీటీసీ.. ఎందుకంటే..?

దిశ ప్రతినిధి, కరీంనగర్: స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో అనారోగ్యంతో ఆసుపత్రిలో ఉన్న ఓటరు తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ప్రత్యేకంగా అంబులెన్స్‌లో వచ్చి ఓటు హక్కును వినియోగించుకున్నారు. జిల్లాలోని చిగురుమామిడి మండలం రేకొండ ఎంపీటీసీ చాడ శోభ కాలుకు సర్జరీ కావడంతో హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్నారు. శుక్రవారం ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ కొనసాగుతుండడంతో శోభ ఆసుపత్రి నుండి నేరుగా అంబులెన్స్‌లో వచ్చారు. ఆమెను స్ట్రెచర్‌పై సహాయకులు పోలింగ్ కేంద్రంలోని తీసుకెళ్లగా ఓటు హక్కు వినియోగించుకోవడం […]

Update: 2021-12-10 04:18 GMT

దిశ ప్రతినిధి, కరీంనగర్: స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో అనారోగ్యంతో ఆసుపత్రిలో ఉన్న ఓటరు తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ప్రత్యేకంగా అంబులెన్స్‌లో వచ్చి ఓటు హక్కును వినియోగించుకున్నారు. జిల్లాలోని చిగురుమామిడి మండలం రేకొండ ఎంపీటీసీ చాడ శోభ కాలుకు సర్జరీ కావడంతో హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్నారు. శుక్రవారం ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ కొనసాగుతుండడంతో శోభ ఆసుపత్రి నుండి నేరుగా అంబులెన్స్‌లో వచ్చారు. ఆమెను స్ట్రెచర్‌పై సహాయకులు పోలింగ్ కేంద్రంలోని తీసుకెళ్లగా ఓటు హక్కు వినియోగించుకోవడం విశేషం.

Tags:    

Similar News