డాక్టర్లపై ఎంపీపీ సీరియస్.. ఎందుకంటే..?
దిశ, దౌల్తాబాద్ : ప్రస్తుత విపత్కర పరిస్థితులలో నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండాల్సిన వైద్య సిబ్బంది నిర్లక్ష్యం వహించడం పై దౌల్తాబాద్ ఎంపీపీ గంగాధర సంధ్య మండిపడ్డారు. మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆమె శనివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆస్పత్రి నిర్వహణ తీరు పరిసరాలు పరిశుభ్రంగా లేకపోవడం పై సిబ్బందిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. మండల వ్యాప్తంగా ఉన్న ప్రజలకు నిత్యం వైద్య సేవలు […]
దిశ, దౌల్తాబాద్ : ప్రస్తుత విపత్కర పరిస్థితులలో నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండాల్సిన వైద్య సిబ్బంది నిర్లక్ష్యం వహించడం పై దౌల్తాబాద్ ఎంపీపీ గంగాధర సంధ్య మండిపడ్డారు. మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆమె శనివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆస్పత్రి నిర్వహణ తీరు పరిసరాలు పరిశుభ్రంగా లేకపోవడం పై సిబ్బందిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. మండల వ్యాప్తంగా ఉన్న ప్రజలకు నిత్యం వైద్య సేవలు అందించాల్సిన సిబ్బంది అలసత్వం వహించడం పద్ధతి కాదని హితవు పలికారు. ఆస్పత్రి నిర్వహణ తీరు నిర్లక్ష్యానికి నిలువెత్తు నిదర్శనంగా కనబడుతుందన్నారు. రికార్డుల నిర్వహణ సైతం సరిగా లేదని, మందుల నిలువ అ నుంచి గది చెత్త కుండీల తయారయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజల ఆరోగ్యంపై ప్రభుత్వం చేస్తున్న ఖర్చును వృధా చేయడం మంచి పద్ధతి కాదని అన్నారు. కాగా గతంలో 24 గంటల ఆరోగ్య కేంద్రంగా వైద్య సేవలు అందించిన ఆసుపత్రి, నేడు దీనావస్థ చేరుకోవడానికి కారణాలను అన్వేషించి తగిన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.
సిబ్బంది కొరత ఆసుపత్రి నిర్వహణ తీరుపై జిల్లా అధికారులకు ఫిర్యాదు చేస్తామని పేర్కొన్నారు. కాగా ఆస్పత్రిని 24 గంటలు ఆరోగ్య కేంద్రంగా మార్చడానికి జిల్లా అధికారులకు ప్రతిపాదనలు పంపినట్లు ఆమె వెల్లడించారు. దీనిపై ఇప్పటివరకు అధికారులు స్పందించడం లేదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లా సర్వసభ్య సమావేశంలో ఆస్పత్రి సిబ్బంది కొరతపై మాట్లాడినప్పటికీ మూడు నెలలు గడిచినా నేటికీ చర్యలు తీసుకోకపోవడం పై ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. కాగా సిబ్బంది పనితీరు రికార్డుల నిర్వహణ ఆసుపత్రి పరిసరాల అపరిశుభ్రత చాలా బాధించాయని, వాటి మార్పు కోసం కృషి చేస్తానని పేర్కొన్నారు. ప్రస్తుతం కరుణాకర్రెడ్డి ముప్పు పొంచి ఉన్న నేపథ్యంలో వైద్య సిబ్బంది మెరుగైన సేవలు అందించాల్సిన అవసరం ఉందని గుర్తుచేశారు.
మండలాన్ని 100 శాతం కరోనా వ్యాక్సినేషన్ మండలంగా తీర్చిదిద్దడానికి క్షేత్రస్థాయిలో ప్రజలకు అవగాహన కల్పించి వ్యాక్సినేషన్ పూర్తి చేయాలని కోరారు. ఆసుపత్రి పరిసరాలలో పెరిగిన పిచ్చి మొక్కలను వెంటనే తొలగించాలని పంచాయతీ కార్యదర్శి యాదగిరి ఆమె ఆదేశించారు. కాగా గతంలో ఆపరేషన్ థియేటర్ ఉన్న గదిలో మందులు నిల్వ ఉంచడం, ప్రసూతి గదిని వృథాగా వదిలేయడం పై సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. అలాగే మందులను భద్రపరిచే గది అపరిశుభ్రంగా ఉండటంతో దానిని వెంటనే శుభ్రం చేయాలని సిబ్బందికి ఆదేశించారు. పని నిర్వహణ తీరు మార్చుకోవాలని ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఫార్మాసిస్ట్ ప్రభాకర్ వైద్య సిబ్బంది శ్రీనివాస్ సుమిత్ర తదితరులు పాల్గొన్నారు.