పాఠశాలను ఆకస్మిక తనిఖీ చేసిన ఎంపీ రంజిత్ రెడ్డి
దిశ, శేరిలింగంపల్లి: చేవెళ్ల లోక్ సభ నియోజకవర్గ పరిధిలోని చందానగర్ వీకర్ సెక్షన్ కాలనీలో గల ప్రభుత్వ పాఠశాల, బస్తీ దవాఖానాలను ఎంపీ రంజిత్ రెడ్డి, స్థానిక కార్పొరేటర్ మంజుల రఘునాథ్ రెడ్డితో కలిసి ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ప్రభుత్వ పాఠశాలలో మధ్యాహ్న భోజన పథకం ఎలా వుంది అని అక్కడి విద్యార్థులను, ఉపాధ్యాయులను అడిగి తెలుసుకున్నారు. అలాగే బస్తీ దవాఖానాలో వైద్యం ఎలా అందుతుంది అని అక్కడికి వచ్చిన రోగులను అడిగి తెలుసుకున్నారు. […]
దిశ, శేరిలింగంపల్లి: చేవెళ్ల లోక్ సభ నియోజకవర్గ పరిధిలోని చందానగర్ వీకర్ సెక్షన్ కాలనీలో గల ప్రభుత్వ పాఠశాల, బస్తీ దవాఖానాలను ఎంపీ రంజిత్ రెడ్డి, స్థానిక కార్పొరేటర్ మంజుల రఘునాథ్ రెడ్డితో కలిసి ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ప్రభుత్వ పాఠశాలలో మధ్యాహ్న భోజన పథకం ఎలా వుంది అని అక్కడి విద్యార్థులను, ఉపాధ్యాయులను అడిగి తెలుసుకున్నారు. అలాగే బస్తీ దవాఖానాలో వైద్యం ఎలా అందుతుంది అని అక్కడికి వచ్చిన రోగులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఎంపీ రంజిత్ రెడ్డి మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుని బస్తీ దవాఖానాలను, సన్న బియ్యంతో మధ్యాహ్న భోజన పథకం అమలు చేస్తున్నారన్నారు. ఈ పథకాలు ఎలా అమలు అవుతున్నాయో తెలుసుకోవడానికే తాను ఆకస్మిక తనిఖీ చేస్తున్నట్లు తెలిపారు. ఆయన వెంట పలువురు టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.