అంబేడ్కర్ సేవలు చిరస్మరణీయం : ఎంపీపీ రమేష్ నాయక్
దిశ, ఇందల్వాయి : ఇందల్వాయి మండల కేంద్రంలోని అంబేడ్కర్ చౌరస్తా లో అంబేడ్కర్ విగ్రహానికి ఎంపీపీ రమేష్ నాయక్, మండల అధ్యక్షులు చిలివేరి గంగాదాస్, sc/st సర్పంచ్‌ల ఫోరమ్ జిల్లా మాజీ అధ్యక్షులు పాశం కుమార్‌లు అంబేడ్కర్ విగ్రహానికి పూలమాలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం ఎంపీపీ రమేష్ నాయక్ మాట్లాడుతూ.. భారత రాజ్యాంగ నిర్మాత సేవలు ఎనలేనివన్నారు. భారత రత్న బాబాసాహెబ్ అంబేడ్కర్ రాజ్యాంగం రాయడం వల్లనే sc/st/bc మైనారిటీలకు రిజర్వేషన్ వచ్చిందన్నారు. ప్రపంచ దేశాలలో […]
దిశ, ఇందల్వాయి : ఇందల్వాయి మండల కేంద్రంలోని అంబేడ్కర్ చౌరస్తా లో అంబేడ్కర్ విగ్రహానికి ఎంపీపీ రమేష్ నాయక్, మండల అధ్యక్షులు చిలివేరి గంగాదాస్, sc/st సర్పంచ్‌ల ఫోరమ్ జిల్లా మాజీ అధ్యక్షులు పాశం కుమార్‌లు అంబేడ్కర్ విగ్రహానికి పూలమాలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం ఎంపీపీ రమేష్ నాయక్ మాట్లాడుతూ.. భారత రాజ్యాంగ నిర్మాత సేవలు ఎనలేనివన్నారు. భారత రత్న బాబాసాహెబ్ అంబేడ్కర్ రాజ్యాంగం రాయడం వల్లనే sc/st/bc మైనారిటీలకు రిజర్వేషన్ వచ్చిందన్నారు.
ప్రపంచ దేశాలలో సైతం అంబేడ్కర్ ఆశయాలు రాజ్యాంగం పట్ల పలువురు అంబేడ్కర్‌ను ఆదర్శంగా తీసుకుంటున్నారని తెలిపారు. ప్రపంచ దేశాలు అంబేడ్కర్‌ను ఆదర్శంగా తీసుకోవడం భారత దేశానికి ఎంతో గర్వకారణమని కొనియాడారు. రాజ్యాంగం పట్ల భారత దేశంలో ప్రతీ రాష్ట్రం, ప్రతీ జిల్లా, ప్రతీ మండలం, ప్రతీ గ్రామాలలో అవగాహనలు కల్పించాలన్నారు. దళితులు భారత దేశంలో తలెత్తుకొని బతకాలనే సంకల్పంతోనే రిజర్వేషన్లు కల్పించినట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ బాదావత్ రమేష్ నాయక్, వైస్ ఎంపీపీ అంజయ్య, తెరాస పార్టీ మండల అధ్యక్షులు చిలివేరి గంగాదాస్, sc/st సర్పంచ్‌ల ఫోరమ్ జిల్లా మాజీ అధ్యక్షులు పాశం కుమార్, మండల అంబేడ్కర్ సంగం అధ్యక్షులు కిష్టయ్య, ఎంపీటీసీ దాస్, ముత్తన్న, గోపాల్, దాసరి గంగాధర్, లక్ష్మణ్, నర్సయ్య, తదితరులు పాల్గొన్నారు.