ఆ ఇళ్లను పేదలకు ఎందుకివ్వడం లేదు?: సీఎం జగన్‌కు ఎంపీ రఘురామ లేఖ
దిశ, ఏపీ బ్యూరో: ఏపీ సీఎం వైఎస్ జగన్‌కు నర్సాపురం ఎంపీ రఘురామ కృష్ణంరాజు మరోసారి లేఖ రాశారు. ఇప్పటికే పలు లేఖలు రాసిన ఆయన తాజాగా ‘నవ సూచనలు’ అనేపేరుతో మంగళవారం మరో లేఖ రాశారు. ఈసారి జగనన్న కాలనీలు, పక్కా ఇళ్ల విషయంపై లేఖ రాశారు. అత్యంత చౌకబారు నిర్మాణ సామాగ్రి ఉపయోగించి కనిష్ఠ సౌకర్యాలు, అరకొర మౌలిక సదుపాయాలతో ఇళ్లు నిర్మించి పేదవారికి ఇవ్వొద్దంటూ హితవు పలికారు. స్వల్పకాలిక ప్రయోజనాల కోసం ప్రజల […]
దిశ, ఏపీ బ్యూరో: ఏపీ సీఎం వైఎస్ జగన్‌కు నర్సాపురం ఎంపీ రఘురామ కృష్ణంరాజు మరోసారి లేఖ రాశారు. ఇప్పటికే పలు లేఖలు రాసిన ఆయన తాజాగా ‘నవ సూచనలు’ అనేపేరుతో మంగళవారం మరో లేఖ రాశారు. ఈసారి జగనన్న కాలనీలు, పక్కా ఇళ్ల విషయంపై లేఖ రాశారు. అత్యంత చౌకబారు నిర్మాణ సామాగ్రి ఉపయోగించి కనిష్ఠ సౌకర్యాలు, అరకొర మౌలిక సదుపాయాలతో ఇళ్లు నిర్మించి పేదవారికి ఇవ్వొద్దంటూ హితవు పలికారు.
స్వల్పకాలిక ప్రయోజనాల కోసం ప్రజల దీర్ఘకాలిక సంతోషాన్ని హరించవద్దని లేఖలో పేర్కొన్నారు. ఇళ్లు లేని నిరుపేదలకు నాసిరకం ఇళ్లు ఇచ్చి వారి సంతోషాన్ని దూరం చేయొద్దని రఘురామ లేఖలో విజ్ఞప్తి చేశారు. అలాగే అమృత్ పథకం ద్వారా చంద్రబాబు ప్రభుత్వం నిర్మించిన ఇళ్లను ఇప్పటి వరకు ఎందుకు పేదవారికి ఇవ్వడం లేదో సమాధానం చెప్పాలని ఎంపీ రఘురామ డిమాండ్ చేశారు.