సాక్షికి రఘురామకృష్ణంరాజు షాక్.. లీగల్ నోటీసులు జారీ

దిశ, ఏపీ బ్యూరో: సాక్షి మీడియాకు ఎంపీ రఘురామకృష్ణంరాజు బుధవారం లీగల్‌ నోటీసులిచ్చారు. తన ప్రతిష్టకు భంగం కలిగించినందుకు బేషరతుగా క్షమాపణ చెప్పాలని నోటీసులో పేర్కొన్నారు. పదిహేను రోజుల్లో నోటీసుకు సమధానం ఇవ్వకుంటే.. 50 కోట్ల పరువునష్టం దావా దాఖలు చేస్తామని రఘురామ హెచ్చరించారు. గతంలో కూడా సాక్షి మీడియాకు లీగల్‌ నోటీస్‌ ఇచ్చారు. రఘురామరాజు తరఫున న్యాయవాది పీవీజీ ఉమేశ్‌చంద్ర ఈ నోటీసు జారీ చేసిన విషయం తెలిసిందే. తన పరువు, ప్రతిష్ఠలకు భంగం కలిగించేలా […]

Update: 2021-06-16 07:31 GMT

దిశ, ఏపీ బ్యూరో: సాక్షి మీడియాకు ఎంపీ రఘురామకృష్ణంరాజు బుధవారం లీగల్‌ నోటీసులిచ్చారు. తన ప్రతిష్టకు భంగం కలిగించినందుకు బేషరతుగా క్షమాపణ చెప్పాలని నోటీసులో పేర్కొన్నారు. పదిహేను రోజుల్లో నోటీసుకు సమధానం ఇవ్వకుంటే.. 50 కోట్ల పరువునష్టం దావా దాఖలు చేస్తామని రఘురామ హెచ్చరించారు. గతంలో కూడా సాక్షి మీడియాకు లీగల్‌ నోటీస్‌ ఇచ్చారు. రఘురామరాజు తరఫున న్యాయవాది పీవీజీ ఉమేశ్‌చంద్ర ఈ నోటీసు జారీ చేసిన విషయం తెలిసిందే.

తన పరువు, ప్రతిష్ఠలకు భంగం కలిగించేలా తనకు వ్యతిరేకంగా, న్యాయవిరుద్ధంగా అనేక కథనాలు ప్రసారం చేసినందుకు బేషరతుగా క్షమాపణలు చెప్పాలని, వారం రోజుల్లోగా స్పందించకుంటే చట్టపరమైన క్రిమినల్‌ చర్యలు తీసుకుంటానని హెచ్చరించారు. ఇందిరా టెలివిజన్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ చైర్‌పర్సన్ వైఎస్‌ భారతీరెడ్డి, పాలకవర్గం డైరెక్టర్లు, ఎడిటర్‌ ఇన్‌ చీఫ్‌ నేమాని భాస్కర్‌, కన్సల్టింగ్‌ ఎడిటర్‌ కొమ్మినేని శ్రీనివాసరావు పేర్లతో ఈ నోటీసు ఇచ్చారు. తన ప్రతిష్ఠకు భంగం కలిగించేలా ప్రసారం చేసిన కథనాలలో కొన్నింటిని నోటీసులో పేర్కొన్నారు.

Tags:    

Similar News