రైళ్ల హాల్టింగ్‌లను పునరుద్ధరించండి
దిశ, మహబూబాబాద్ : కొవిడ్ తాండవిస్తున్న సమయంలో సౌత్ సెంట్రల్ రైల్వే జోన్ పరిధిలో పలు రైళ్ల హాల్టింగ్ ఎత్తివేశారని, ఆ రైళ్లను తిరిగి పునరుద్ధరణ చేయాలని మహబూబాబాద్ ఎంపీ మాలోత్ కవిత రైల్వే అధికారులను కోరారు. మంగళవారం సికింద్రాబాద్ రైల్ నిలయంలో జరిగిన సౌత్ సెంట్రల్ రైల్వే సమావేశంలో ఎంపీ మాట్లాడారు. మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండల కేంద్రంలోని ఆర్యూబీని ఆర్ఓబీగా అభివృద్ధి చేయాలని, ఇల్లందు రైల్వేస్టేషన్‌ను ప్రారంభించాలన్నారు. పాండు రంగాపురం-సారపాక రైల్వే లైన్ మంజూరు […]
దిశ, మహబూబాబాద్ : కొవిడ్ తాండవిస్తున్న సమయంలో సౌత్ సెంట్రల్ రైల్వే జోన్ పరిధిలో పలు రైళ్ల హాల్టింగ్ ఎత్తివేశారని, ఆ రైళ్లను తిరిగి పునరుద్ధరణ చేయాలని మహబూబాబాద్ ఎంపీ మాలోత్ కవిత రైల్వే అధికారులను కోరారు. మంగళవారం సికింద్రాబాద్ రైల్ నిలయంలో జరిగిన సౌత్ సెంట్రల్ రైల్వే సమావేశంలో ఎంపీ మాట్లాడారు. మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండల కేంద్రంలోని ఆర్యూబీని ఆర్ఓబీగా అభివృద్ధి చేయాలని, ఇల్లందు రైల్వేస్టేషన్‌ను ప్రారంభించాలన్నారు.
పాండు రంగాపురం-సారపాక రైల్వే లైన్ మంజూరు చేయాలని, మణుగూరు నుంచి మంచిర్యాలకు, డోర్నకల్ నుండి సూర్యాపేట వరకు రైల్వే లైన్‌లు మంజూరు చేయాలని కోరారు. విభజన చట్టం ప్రకారం కాజీపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేయాలన్నారు. గుండ్రాతి మడుగు రైల్వే స్టేషన్‌లో ఫుట్ ఓవర్ బ్రిడ్జి నిర్మించాలని, మహబూబాబాద్ రైల్వే స్టేషన్‌ను క్లాస్ -ఏ స్టేషన్‌గా అప్ గ్రేడ్ చేయాలని అధికారులను కోరారు.