ఎమ్మెల్యే ముత్తిరెడ్డికి దిమ్మ తిరిగే షాకిచ్చిన కోమ‌టిరెడ్డి

దిశ ప్రతినిధి, వరంగ‌ల్: భువ‌న‌గిరి కాంగ్రెస్‌ ఎంపీ కోమ‌టిరెడ్డి వెంక‌ట్‌రెడ్డి జ‌న‌గామ‌ టీఆర్ఎస్ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాద‌గిరి రెడ్డికి దిమ్మతిరిగే షాక్ ఇచ్చారు. జ‌న‌గామ నియోజ‌క‌వ‌ర్గంలోని న‌ర్మెట్ట మండ‌లం రత్నత౦డా రోడ్డు నిర్మాణ ప‌నుల‌ను ఎంపీ శ‌నివారం ప్రారంభించారు. ఎంపీ నిధుల‌తో ఈ ప‌నులు చేప‌డుతుండ‌టం గ‌మ‌నార్హం. కొద్దిరోజుల క్రితం తండాకు రోడ్డు నిర్మించాల‌ని కోరుతూ జ‌న‌గామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి కాన్వాయ్‌ను గ్రామ‌స్థులు, యువ‌కులు అడ్డుకున్న విష‌యం తెలిసిందే. ఈ ఆందోళ‌న స‌మ‌యంలో ఎమ్మెల్యే అనుచ‌రుల‌కు, టీఆర్‌ఎస్ […]

Update: 2021-07-31 05:55 GMT

దిశ ప్రతినిధి, వరంగ‌ల్: భువ‌న‌గిరి కాంగ్రెస్‌ ఎంపీ కోమ‌టిరెడ్డి వెంక‌ట్‌రెడ్డి జ‌న‌గామ‌ టీఆర్ఎస్ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాద‌గిరి రెడ్డికి దిమ్మతిరిగే షాక్ ఇచ్చారు. జ‌న‌గామ నియోజ‌క‌వ‌ర్గంలోని న‌ర్మెట్ట మండ‌లం రత్నత౦డా రోడ్డు నిర్మాణ ప‌నుల‌ను ఎంపీ శ‌నివారం ప్రారంభించారు. ఎంపీ నిధుల‌తో ఈ ప‌నులు చేప‌డుతుండ‌టం గ‌మ‌నార్హం. కొద్దిరోజుల క్రితం తండాకు రోడ్డు నిర్మించాల‌ని కోరుతూ జ‌న‌గామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి కాన్వాయ్‌ను గ్రామ‌స్థులు, యువ‌కులు అడ్డుకున్న విష‌యం తెలిసిందే. ఈ ఆందోళ‌న స‌మ‌యంలో ఎమ్మెల్యే అనుచ‌రుల‌కు, టీఆర్‌ఎస్ నేత‌ల‌కు గ్రామ‌స్తులకు మధ్య తీవ్ర వాగ్వాదం జ‌రిగింది. ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా ఆందోళ‌న‌కారులు పెద్ద ఎత్తున నినాదాలు చేప‌ట్టారు.

ఇటీవల గ్రామానికి రోడ్డు నిర్మిస్తామ‌ని హామీ ఇచ్చి ఎమ్మెల్యే వెళ్లిపోయారు. మ‌రుస‌టిరోజు కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు జంగా రాఘ‌వ‌రెడ్డి నేతృత్వంలో ఆ పార్టీ జిల్లా నేత‌లు తండా మార్గాన్ని ప‌రిశీలించారు. జ‌న‌గామ ఎమ్మెల్యే వైఖ‌రిని ఎండ‌గ‌ట్టారు. ఈ ప‌రిణామం త‌ర్వాత శ‌నివారం మున్సిపల్ సమావేశంలో పాల్గొనడానికి వచ్చిన ఎంపీ కోమ‌టిరెడ్డి వెంక‌ట్ రెడ్డి నేరుగా ర‌త్నతండాకు వెళ్లి త‌న ఎంపీ నిధుల‌తో తండాకు రోడ్డు నిర్మాణ ప‌నులు ప్రారంభించారు. ఎంపీ కోమటిరెడ్డి తండాకు చేరుకొని రోడ్డు నిర్మాణ పనులు ప్రారంభించిన విషయం స్థానిక ఎమ్మెల్యేకి తెలియకపోవడం గమనార్హం. ఈ సందర్భంగా ఎంపీ కోమ‌టిరెడ్డికి తండావాసులు కృత‌జ్ఞత‌లు తెలిపారు. కాగా, స్థానిక ఎమ్మెల్యే ముత్తిరెడ్డికి కోమటిరెడ్డి దిమ్మ తిరిగే షాక్ ఇచ్చాడంటూ రాజ‌కీయ వ‌ర్గాల్లో అప్పుడే చ‌ర్చ మొద‌లైంది.

ఎమ్మెల్యే క్రాంతి కిరణ్‌కు ప్రజలు ఝలక్

Tags:    

Similar News