కమల్‌నాథ్ సర్కారుకు పరీక్ష!
భోపాల్: మధ్యప్రదేశ్ అసెంబ్లీలో సోమవారం బలపరీక్ష నిర్వహించాలని రాష్ట్ర గవర్నర్ లాల్‌జీ టాండన్.. స్పీకర్ నర్మదా ప్రసాద్ ప్రజాపతిని ఆదేశించారు. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర సీఎం కమల్‌నాథ్ క్యాబినెట్ సమావేశాన్ని నిర్వహించారు. ఇందులో బలపరీక్ష గురించి మాట్లాడినట్టు తెలిసింది. మంత్రిమండలి సమావేశానంతరం మినిస్టర్ ప్రదీప్ జైస్వాల్ మాట్లాడుతూ.. ‘మాకు సరిపడా ఎమ్మెల్యేల బలమున్నది. సీఎం కాన్ఫిడెంట్‌గా ఉన్నారు. అయితే, కరోనా కల్లోలం వల్ల బలపరీక్ష రేపు జరుగుతుందా? లేదా? అన్నది కచ్చితంగా చెప్పలేమ’ని అనడం గమనార్హం. మరోవైపు […]
భోపాల్: మధ్యప్రదేశ్ అసెంబ్లీలో సోమవారం బలపరీక్ష నిర్వహించాలని రాష్ట్ర గవర్నర్ లాల్‌జీ టాండన్.. స్పీకర్ నర్మదా ప్రసాద్ ప్రజాపతిని ఆదేశించారు. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర సీఎం కమల్‌నాథ్ క్యాబినెట్ సమావేశాన్ని నిర్వహించారు. ఇందులో బలపరీక్ష గురించి మాట్లాడినట్టు తెలిసింది. మంత్రిమండలి సమావేశానంతరం మినిస్టర్ ప్రదీప్ జైస్వాల్ మాట్లాడుతూ.. ‘మాకు సరిపడా ఎమ్మెల్యేల బలమున్నది. సీఎం కాన్ఫిడెంట్‌గా ఉన్నారు. అయితే, కరోనా కల్లోలం వల్ల బలపరీక్ష రేపు జరుగుతుందా? లేదా? అన్నది కచ్చితంగా చెప్పలేమ’ని అనడం గమనార్హం.
మరోవైపు బలపరీక్ష నేపథ్యంలోనే జైపూర్‌కు తరలించిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు భోపాల్‌కు తిరిగివచ్చారు. హర్యానాకు పంపించిన బీజేపీ ఎమ్మెల్యేల దగ్గరకు మాజీ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ చేరుకున్నారు. కాగా, తమకు కేంద్ర పారామిలటరీ బలగాల బందోబస్తు ఏర్పాటు చేయాలని బెంగుళూరులోని కాంగ్రెస్ రెబల్ ఎమ్మెల్యేలు డిమాండ్ చేశారు.
tags : kamal nath, madhya pradesh, floor test, cabinet meet, assembly