హంతకులైన టీఆర్ఎస్ కార్యకర్తలను కాపాడొద్దు : ఎంపీ అర్వింద్
దిశప్రతినిధి, నిజామాబాద్ : కమ్మర్ పల్లి మండలం హాసకొత్తూరు గ్రామానికి చెందిన భారతీయ జనతా పార్టీ కార్యకర్త మాలావత్ సిద్ధార్థ్ (19)ని అదే గ్రామానికి చెందిన గ్రామ టీఆర్ఎస్ అధ్యక్షుడు కనక రాజేష్, అతని అనుచరులైన బాలా గౌడ్, పృథ్వీరాజ్, అన్వేష్ లు మరికొందరితో కలిసి కర్రలు, బీరు సీసాలతో దాడి చేసి కిరాతకంగా హత్య చేశారని నిజామాబాద్ పార్లమెంట్ సభ్యులు ధర్మపురి అర్వింద్ ఆరోపించారు. బీజేపీ కార్యకర్తను హత్య చేసిన టీఆర్ఎస్ కార్యకర్తలను కాపాడడానికి ప్రయత్నించవద్దని […]
దిశప్రతినిధి, నిజామాబాద్ : కమ్మర్ పల్లి మండలం హాసకొత్తూరు గ్రామానికి చెందిన భారతీయ జనతా పార్టీ కార్యకర్త మాలావత్ సిద్ధార్థ్ (19)ని అదే గ్రామానికి చెందిన గ్రామ టీఆర్ఎస్ అధ్యక్షుడు కనక రాజేష్, అతని అనుచరులైన బాలా గౌడ్, పృథ్వీరాజ్, అన్వేష్ లు మరికొందరితో కలిసి కర్రలు, బీరు సీసాలతో దాడి చేసి కిరాతకంగా హత్య చేశారని నిజామాబాద్ పార్లమెంట్ సభ్యులు ధర్మపురి అర్వింద్ ఆరోపించారు.
బీజేపీ కార్యకర్తను హత్య చేసిన టీఆర్ఎస్ కార్యకర్తలను కాపాడడానికి ప్రయత్నించవద్దని మంత్రి ప్రశాంత్ రెడ్డికి ఎంపీ అర్వింద్ విన్నవించారు. సిద్దార్థ్‌ను హత్య చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, ఈ కిరాతకులను వదిలిపెట్టొద్దని ఆర్మూర్ ఏసీపీకి చెప్పగా.. ప్రాథమికంగా సాక్ష్యాలు బలంగా ఉన్నాయని నిందితులను అరెస్ట్ చేసినట్టు తెలిపారు. వారికి బెయిల్ కూడా దొరకదని, శిక్ష పడడం ఖాయమని తనతో తెలిపారన్నారు. బీజేపీ కార్యకర్త మాలావత్ సిద్దార్థ్‌కు పార్టీ అండగా ఉంటుందని అతి త్వరలో కుటుంబ సభ్యులను కలవడానికి హాస కొత్తూరు గ్రామానికి వెళ్తానని ఎంపీ అర్వింద్ తెలిపారు.