నిధులు మంజూరు చేసిన బండి సంజయ్
దిశ, మెదక్: హుస్నాబాద్ పట్టణంలో పలు అభివృద్ధి పనులకు ఎంపీ నిధుల నుంచి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ నిధులు మంజూరు చేశారని హుస్నాబాద్ టౌన్ అధ్యక్షుడు బత్తుల శంకర్ బాబు తెలిపారు. సిద్ధిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణంలోని 8వ వార్డులో పలు అభివృద్ధి పనులకు రూ . 4.98 లక్షలు, 11 వ వార్డులోని రూ. 5 లక్షలు, శిశుమందిర్ భవనానికి ఒక గది నిర్మాణానికి రూ . 4. 99 లక్షలు, […]
దిశ, మెదక్: హుస్నాబాద్ పట్టణంలో పలు అభివృద్ధి పనులకు ఎంపీ నిధుల నుంచి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ నిధులు మంజూరు చేశారని హుస్నాబాద్ టౌన్ అధ్యక్షుడు బత్తుల శంకర్ బాబు తెలిపారు. సిద్ధిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణంలోని 8వ వార్డులో పలు అభివృద్ధి పనులకు రూ . 4.98 లక్షలు, 11 వ వార్డులోని రూ. 5 లక్షలు, శిశుమందిర్ భవనానికి ఒక గది నిర్మాణానికి రూ . 4. 99 లక్షలు, పందిల్ల గ్రామంలోని స్కూల్ ప్రహరీకి రూ . 4 లక్షలు.. మొత్తం రూ. 18.97 లక్షలు మంజూరు చేశారన్నారు. ఇందుకుగాను బండి సంజయ్ కి శంకర్ బాబుతోపాటు కౌన్సిలర్లు దొడ్డి శ్రీనివాస్, వేణు యాదవ్, పందిళ్ల ఎంపీటీసీ బాణాల జయలక్ష్మిలు కృతజ్ఞతలు తెలిపారు.