ప్రభుత్వ దవాఖానాల్లో వసతులు నిల్ : బండి

దిశ, వెబ్ డెస్క్: ప్రభుత్వ దవాఖానాల్లో వసతులు సరిగా లేక రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ అన్నారు. గురువారం హైదరాబాద్‌ పాతబస్తీలోని ఉస్మానియా ఆస్పత్రిని సందర్శించారు. రెండ్రోజులుగా తెలంగాణలో కురుస్తున్న వర్షాలకు ఆస్పత్రిలో భారీగా నీరు చేరింది. రోగులు చికిత్స పొందుతున్న బెడ్ల కింద నీరు చేరడంతో పాటు, విలువైన వైద్య పరికరాలు మొత్తం నీటితో తడిచిపోయాయి. దీంతో వైద్యం అందించలేక డాక్టర్లు కూడా అనేక ఇబ్బందులను […]

Update: 2020-07-16 00:59 GMT

దిశ, వెబ్ డెస్క్: ప్రభుత్వ దవాఖానాల్లో వసతులు సరిగా లేక రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ అన్నారు. గురువారం హైదరాబాద్‌ పాతబస్తీలోని ఉస్మానియా ఆస్పత్రిని సందర్శించారు. రెండ్రోజులుగా తెలంగాణలో కురుస్తున్న వర్షాలకు ఆస్పత్రిలో భారీగా నీరు చేరింది. రోగులు చికిత్స పొందుతున్న బెడ్ల కింద నీరు చేరడంతో పాటు, విలువైన వైద్య పరికరాలు మొత్తం నీటితో తడిచిపోయాయి. దీంతో వైద్యం అందించలేక డాక్టర్లు కూడా అనేక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలోనే బండి సంజయ్ ఉస్మానియా ఆస్పత్రిని సందర్శించి రోగుల అవస్థలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా బండి మాట్లాడుతూ.. రాష్ట్రంలోని ఆస్పత్రుల్లో నెలకొన్న వసతుల లేమీ పై ఏ ఒక్క మంత్రి గానీ, ఎమ్మెల్యేలు గానీ ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు. కార్పొరేట్ ఆస్పత్రుల దోపిడిని అరికట్టంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫమైందని ఆయన మండిపడ్డారు. కరోనాను ఆరోగ్యశ్రీలో చేర్చాలని ఎన్నిమార్లు డిమాండ్ చేసినా ప్రభుత్వం పట్టించుకోకపోవడం దుర్మార్గమని వాపోయారు.

Tags:    

Similar News