తెలంగాణకు తీరని అన్యాయం చేసిండు : బండి
దిశ, వెబ్‌డెస్క్: బంగారు తెలంగాణను చేస్తానని చెప్పిన సీఎం కేసీఆర్, రాష్ట్రానికి తీరని అన్యాయం చేశాడని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ మండిపడ్డారు. కృష్ణా జలాల్లో రాష్ట్రానికి 575 టీఎంసీల నీటి వాటా రావాల్సి ఉంటే.. కేసీఆర్ 299 టీఎంసీలకు ఒప్పుకోవడం అన్యాయమన్నారు. కేసీఆర్ 299 టీఎంసీలకు అంగీకరిస్తూ సంతకం పెట్టడాన్ని.. జగన్ అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో ప్రస్తావించినట్లు తెలిసిందని బండి సంజయ్ వివరించారు. నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టుల్లో నీటి వాటాను అడగకుండా.. […]
దిశ, వెబ్‌డెస్క్: బంగారు తెలంగాణను చేస్తానని చెప్పిన సీఎం కేసీఆర్, రాష్ట్రానికి తీరని అన్యాయం చేశాడని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ మండిపడ్డారు.
కృష్ణా జలాల్లో రాష్ట్రానికి 575 టీఎంసీల నీటి వాటా రావాల్సి ఉంటే.. కేసీఆర్ 299 టీఎంసీలకు ఒప్పుకోవడం అన్యాయమన్నారు. కేసీఆర్ 299 టీఎంసీలకు అంగీకరిస్తూ సంతకం పెట్టడాన్ని.. జగన్ అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో ప్రస్తావించినట్లు తెలిసిందని బండి సంజయ్ వివరించారు.
నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టుల్లో నీటి వాటాను అడగకుండా.. కేసీఆర్ తెలంగాణకు తీరని అన్యాయం చేస్తున్నారన్నారని బండి ఆగ్రహం వ్యక్తం చేశారు. స్వప్రయోజనాల కోసం రాష్ట్ర ప్రయోజనాలను కేసీఆర్ తాకట్టు పెడుతున్నారని దుయ్యబట్టారు. సీఎం కేసీఆర్ తెలంగాణ ద్రోహి అని.. చరిత్ర అతన్నిఎప్పుడూ క్షమించదని బండి సంజయ్ వెల్లడించారు.