Dharmapuri Arvind : కేసీఆర్ రైతులను వాళ్లకు అమ్ముకున్నడు
దిశ, జగిత్యాల : తెలంగాణలోని రైతాంగాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ (chief Minister KCR) రైస్ మిల్లర్లకు అమ్ముకున్నాడని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ (Dharmapuri Arvind) సంచలన వ్యాఖ్యలు చేశారు. జగిత్యాల జిల్లాలోని మెట్ పల్లి మండలం జగ్గసాగర్ గ్రామంలోని వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఎంపీ అరవింద్ మంగళవారం పరిశీలించారు. కొనుగోళ్ల పై రైతుల నుండి వివరాలు అడిగి తెలుసుకున్న ఆయన జిల్లా కలెక్టర్ రవితో ఫోన్‌లో మాట్లాడారు. ధాన్యం కొనుగోళ్ల పై జరుగుతున్న జాప్యంపై […]
దిశ, జగిత్యాల : తెలంగాణలోని రైతాంగాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ (chief Minister KCR) రైస్ మిల్లర్లకు అమ్ముకున్నాడని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ (Dharmapuri Arvind) సంచలన వ్యాఖ్యలు చేశారు. జగిత్యాల జిల్లాలోని మెట్ పల్లి మండలం జగ్గసాగర్ గ్రామంలోని వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఎంపీ అరవింద్ మంగళవారం పరిశీలించారు. కొనుగోళ్ల పై రైతుల నుండి వివరాలు అడిగి తెలుసుకున్న ఆయన జిల్లా కలెక్టర్ రవితో ఫోన్‌లో మాట్లాడారు. ధాన్యం కొనుగోళ్ల పై జరుగుతున్న జాప్యంపై ఆరా తీశారు.
ఈ సందర్భంగా అర్వింద్ మాట్లాడుతూ.. ధాన్యం కొనుగోలులో అదనంగా తరుగు తీయడం, లారీల పేరుతో రైతులను దోచుకోవడంపై విచారం వ్యక్తం చేశారు. అకాల వర్షాలతో తడిసిన ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలన్నారు. ప్రభుత్వం, రైసు మిల్లర్లు , అధికారులు కుమ్మక్కై రైతుల నడ్డి విరుస్తున్నారని విమర్శించారు. తరుగు పేరిట జగిత్యాల జిల్లాలో రైసు మిల్లర్లు రైతులను వేధిస్తున్నారని గుర్తుచేశారు. దీనిపై ఎఫ్‌సీఐకు ఫిర్యాదు చేస్తామని హెచ్చరించారు. రైతులు పంట పండిచేందుకు పడే కష్టం కంటే పంట అమ్ముకోవడానికి ఎక్కువ ఇబ్బందులు పడుతున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. ధాన్యాన్ని కొనుగోలు చేస్తే రసీదులు ఇవ్వకుండా ఇబ్బంది పెట్టడం ఎంటనీ జిల్లా పాలనాధికారిని ప్రశ్నించారు. కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం కుప్పలు కుప్పలుగా పేరుకపోయిందని, అకాల వర్షాలు వచ్చే అవకాశం ఉన్నందున కొనుగోళ్లను వేగవంతం చేయాలన్నారు. ఉమ్మడి రాష్ట్రంలోనే ధాన్యం కొనుగోళ్ళు బాగుండేవని రైతులు భావిస్తున్నట్లు తెలిపారు.