పసుపు రైతులకు గుడ్‌న్యూస్ చెప్పిన ఎంపీ అర్వింద్..
దిశ ప్రతినిధి, నిజామాబాద్ : నిజామాబాద్ నుంచి సాంగ్లీకి వచ్చే సీజన్‌లో రైలు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని, సాంగ్లీ మార్కెట్‌కు పసుపు తరలిస్తే క్వింటాకు రూ.300 మిగులుతుందని ఎంపీ అర్వింద్ తెలిపారు. బుధవారం నిజామాబాద్ మార్కెట్ యార్డులో వ్యాపారులు, పసుపు ట్రేడర్లు, రైతులతో ఎంపీ అర్వింద్, రైల్వే అధికారులు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ.. వచ్చే సీజన్‌లో పసుపు, వరి, మొక్కజొన్నను మార్కెట్‌కు తరలించే అవకాశం కలుగుతుందన్నారు. ఈశాన్య రాష్ట్రాలకు బియ్యం సైతం తరలించేందుకు […]
దిశ ప్రతినిధి, నిజామాబాద్ : నిజామాబాద్ నుంచి సాంగ్లీకి వచ్చే సీజన్‌లో రైలు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని, సాంగ్లీ మార్కెట్‌కు పసుపు తరలిస్తే క్వింటాకు రూ.300 మిగులుతుందని ఎంపీ అర్వింద్ తెలిపారు. బుధవారం నిజామాబాద్ మార్కెట్ యార్డులో వ్యాపారులు, పసుపు ట్రేడర్లు, రైతులతో ఎంపీ అర్వింద్, రైల్వే అధికారులు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ.. వచ్చే సీజన్‌లో పసుపు, వరి, మొక్కజొన్నను మార్కెట్‌కు తరలించే అవకాశం కలుగుతుందన్నారు.
ఈశాన్య రాష్ట్రాలకు బియ్యం సైతం తరలించేందుకు వీలవుతుందని, క్వింటాలుకు రూ.50 వరకు బియ్యం మీద మిగులుతుందన్నారు. రవాణాపై రైతులకు 50 శాతం రాయితీ ఇస్తామని రైల్వే అధికారులు చెప్పారు. నిజామాబాద్ నుంచి సాంగ్లీకి పసుపు తరలించేందుకు వీలుగా కిసాన్ రైలు నడిపేందుకు రైల్వే అధికారులు సుముఖంగా ఉన్నారని ఎంపీ వెల్లడించారు. సమావేశంలో డివిజనల్ ఆపరేటింగ్ మేనేజర్ వెంకన్న, కమర్షియల్ మేనేజర్ రాజ్ కుమార్, స్పైస్ బోర్డు డిప్యూటీ డైరెక్టర్ సుదర్శన్, కమర్షియల్ ఇన్‌స్పెక్టర్ రవికుమార్, గూడ్స్ చీఫ్ సూపర్ వైజర్ కిషోర్, కమర్షియల్ ఇన్‌స్పెక్టర్ రమణ, ట్రాఫిక్ ఇన్‌స్పెక్టర్ రవి శంకర్ తదితరులున్నారు.