ప్రగతిభవన్‌ను డిస్ట్రబ్ చేస్తాం: ఎంపీ అరవింద్

దిశ, న్యూస్‌బ్యూరో: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ ఫైర్ అయ్యారు. కేసీఆర్ చట్టాలను తుంగలో తొక్కి గులాబీ చట్టాలను అమలు చేస్తున్నారని ఓ రేంజ్‌లో విరుచుకుపడ్డారు. శనివారం ఆయన హైదరాబాద్‌లోని తన నివాసంలో మీడియాతో మాట్లాడుతూ గులాబీ రంగు పూసుకున్న వారికి ఓ రకమైన చట్టాలు, ఇతరులకు ఇంకో రకమైన చట్టాలను వర్తింపజేస్తూ నీచ రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. కేసీఆర్ నిజామాబాద్ జిల్లాను డిస్ట్రబ్ చేయడం మానుకోవాలని లేకుంటే మేం ప్రగతిభవన్‌ను డిస్ట్రబ్ […]

Update: 2020-05-23 08:40 GMT

దిశ, న్యూస్‌బ్యూరో: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ ఫైర్ అయ్యారు. కేసీఆర్ చట్టాలను తుంగలో తొక్కి గులాబీ చట్టాలను అమలు చేస్తున్నారని ఓ రేంజ్‌లో విరుచుకుపడ్డారు. శనివారం ఆయన హైదరాబాద్‌లోని తన నివాసంలో మీడియాతో మాట్లాడుతూ గులాబీ రంగు పూసుకున్న వారికి ఓ రకమైన చట్టాలు, ఇతరులకు ఇంకో రకమైన చట్టాలను వర్తింపజేస్తూ నీచ రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. కేసీఆర్ నిజామాబాద్ జిల్లాను డిస్ట్రబ్ చేయడం మానుకోవాలని లేకుంటే మేం ప్రగతిభవన్‌ను డిస్ట్రబ్ చేయాల్సి ఉంటుందని ఘాటు వ్యాఖ్యలు చేశారు.

మై హోం సంస్థ మైనింగ్ చట్టాల ఉల్లంఘనతో బెదిరింపులకు పాల్పడుతూ జాతీయ సంపదను ఇతర దేశాలకు తరలిస్తుందని ఆరోపించారు. ఈ సంస్థలో ఐర్లాండ్ కంపెనీ భాగస్వామిగా ఉందని, అయితే మైనింగ్‌లో విదేశీ సంస్థలకు ఎలాంటి అవకాశం ఉండదని పేర్కొన్నారు. అసలు ఆ కంపెనీకి 50శాతం వాటా ఎలా ఇస్తారని ప్రశ్నించారు. మైనింగ్ చట్టం ప్రకారం అన్నిరకాల బదిలీలు వేలం ద్వారా జరగాల్సి ఉంటే నిబంధనలు ఉల్లంఘించారని అన్నారు. 2013లో శ్రీ జయ జ్యోతి సిమెంట్ పరిశ్రమ తమ యాజమాన్యాన్ని మైహోమ్‌కి మార్చిందని, కానీ ఇప్పుడు ఆ సంస్థతో సంబంధం లేని మై హోం సంస్థ చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. 2002లో మై హోమ్ కంపెనీకి నల్లగొండ జిల్లా మేళ్ల‌చెరువు మండలంలో 300 ఎకరాలు కేటాయింపు జరిగితే ఇందులో 2007లో కేంద్ర ప్రభుత్వం చేసిన జియో మ్యాపింగ్‌లో 79.16 ఎకరాలు ఫారెస్ట్ ల్యాండ్‌గా తెలిందన్నారు. కానీ ఆ భూమిని ప్రభుత్వానికి అప్పగించాల్సిన మై హోమ్ సంస్థ కాంగ్రెస్ పార్టీతో లోపాయకారి ఒప్పందం చేసుకుందన్నారు. హుజూర్‌నగర్‌లో 113 ఎకరాలకు పైగా భూదాన్ భూములను మై‌హోమ్ రామేశ్వర్‌రావు 20 ఏళ్లుగా అక్రమంగా మైనింగ్ చేస్తుంటే ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఏమీ చేస్తున్నరని ప్రశ్నించారు.

Tags:    

Similar News