ఆ హీరోయిన్ రోజు గదికి వస్తోందని టాలీవుడ్ అగ్ర హీరో చేసిన పనికి అంతా షాక్.. చివరికి?

హీరో శోభన్ బాబు గురించి స్పెషల్‌గా చెప్పాల్సిన అక్కర్లేదు. సంపూర్ణ రామాయణం, వీరాభిమన్యు, కురుక్షేత్రం వంటి సూపర్ హిట్ చిత్రాల్లో నటించి స్టార్ గుర్తింపు దక్కించుకున్నారు.

Update: 2024-07-22 10:38 GMT

దిశ, సినిమా: హీరో శోభన్ బాబు గురించి స్పెషల్‌గా చెప్పాల్సిన అక్కర్లేదు. సంపూర్ణ రామాయణం, వీరాభిమన్యు, కురుక్షేత్రం వంటి సూపర్ హిట్ చిత్రాల్లో నటించి స్టార్ గుర్తింపు దక్కించుకున్నారు. పౌరాణిక, కుటుంబ కథా చిత్రాలకు శోభన్ బాబు పెట్టింది పేరు. అప్పట్లో శోభన్ బాబు హ్యాండ్సమ్‌కు మగువలు ఫిదా అయిపోయేవారనడంలో అతిశయోక్తిలేదు. చాలా మంది ఈ హీరోతో పరిచయం పెంచుకోవాలని ఆశపడేవారు. అయితే ప్రముఖ రచయిత కానగల జయకుమార్ రీసెంట్‌గా ఓ ఇంటర్వ్యూకు హాజరై.. పలు విషయాలు వెల్లడించారు. ‘‘సంపూర్ణ రామాయణం సినిమా షూటింగ్ సమయంలో శోభన్ బాబు నాకు చాలా క్లోజ్ అయ్యారు.

ఎప్పుడు ఆయన రూమ్ కు పిలిచేవారు. ఏమైనా పాట పాడమని అడిగేవారు. ఈ మూవీలో చంద్రకళ హీరోయిన్‌గా నటించింది. ఆమె శోభన్ బాబు రూమ్ పక్కనే ఉండేది. తనకు బోర్ అనిపించినప్పుడల్లా ఈ హీరో గదికి వచ్చేది. తరచూ చంద్రకళ తన గదికి రావడం ఎవరైన చూస్తే బాగోదని తనను శోభన్ బాబు అవాయిడ్ చేశాడు. అలాగే ఓ రోజు ఆమెకే డైరెక్ట్ చెప్పేశాడు. ఏ హీరోయిన్ వంక కూడా చూడని శోభన్ బాబు.. హీరోయిన్ జయలలిత ప్రేమలో పడటం నాకు వింతగా అనిపించింది. డాక్టర్ బాబు సినిమాలో వీరిద్దరు కలిసి నటించినప్పుడు.. జయలలిత చాలా అందంగా తయారై వచ్చేది. ఆమె వెంట రెండు కార్లు వచ్చేవి. కూలర్, ఐస్ బాక్స్ కార్ ఒకటి, మేకప్ సిబ్బంది కారు ఒకటి.’’ అంటూ రచయిత కనగల జయకుమార్ ఇంటర్వ్యూలో వెల్లడించారు. 


Similar News