Nayantara అలాంటిది.. ఆమెను నేను అస్సలు అలా అనుకోలేదు.. సీనియర్ నటి సంచలన కామెంట్స్
లేడీ సూపర్ స్టార్ నయనతార(Nayanthara) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.
దిశ, సినిమా: లేడీ సూపర్ స్టార్ నయనతార(Nayanthara) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ‘లక్ష్మి’(Lakshmi) సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి.. తన నటనతో మంచి గుర్తింపు సంపాదించుకున్నది. దాదాపు స్టార్ హీరోలందరి సరసన నటించి స్టార్ హీరోయిన్‌గా రాణిస్తోంది. ఇక కెరీర్ పీక్స్‌లో ఉన్నప్పడు డైరెక్టర్ విగ్నేష్ శివన్(Vignesh Shivan)ను ప్రేమించి పెళ్లి చేసుకుంది. కాగా వీరికి సరోగసి ద్వారా ఇద్దరు బాబులు కూడా పుట్టారు. ప్రస్తుతం లేడీ ఓరియేంటెడ్ సినిమాల్లో నటిస్తూ లేడీ సూపర్ స్టార్‌గా బిరుదు తెచ్చుకుంది. అయితే నయనతార పై ఓ సీనియర్ నటి చేసిన కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వివరాల్లోకి వెళితే..
రఘు వరన్ బీటెక్(Raghuvaran B.tech) సినిమాలో అమ్మ క్యారెక్టర్‌లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్న సీనియర్ నటి శరణ్య పొన్వన్నన్(Saranya Ponvannan) అందరికీ సుపరిచితమే. ఒకప్పుడు స్టార్ హీరోయిన్‌గా రాణించిన ఈమె.. ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా మెప్పిస్తోంది. కాగా ఎప్పుడూ వివాదాలకు దూరంగా ఉంటే శరణ్య తాజాగా నయనతార పై చేసిన కామెంట్స్ నెట్టింట హల్‌చల్ చేస్తున్నాయి. ఆమె మాట్లాడుతూ.. “హీరోయిన్ నయనతార ఎవరితో మాట్లాడక పోవడం వల్ల ఆమె అందరి దృష్టిలో చెడ్డదానిలా కనిపిస్తుంది. ఎందుకంటే నయన్ చాలా స్వీట్ అండ్ జన్యూన్ పర్సన్. ఆమె తన ప్రత్యర్థిని ఎలా ఎదురుకోవాలో కూడా తెలియని వ్యక్తి. అసలు ఆమె సమస్యలకు పది అడుగుల దూరంలో ఉంటుంది. ఇది నాకు చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది. తమిళ చిత్రసీమలో ఈ స్థాయి ఉన్న హీరోయిన్ చాలా పవర్ ఫుల్‌గా ఉండాలి కానీ ఆమె అలా కాదు చాలా మెతక మనిషి” అని శరణ్య చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఈమె చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.