నీ అమాయకపు భర్తను ఎందుకు మోసం చేశావు.. నెటిజన్ ప్రశ్నకు అదిరిపోయే ఆన్సర్ ఇచ్చిన సమంత
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత ఇప్పుడిప్పుడే మయోసైటీస్ వ్యాధి నుంచి కోలుకుంటుంది.
దిశ, సినిమా: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత ఇప్పుడిప్పుడే మయోసైటీస్ వ్యాధి నుంచి కోలుకుంటుంది. ప్రస్తుతం రీ ఎంట్రీ ఇచ్చేందుకు ఎదురు చూస్తున్న ఈ అమ్మడు.. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ పలు హాట్ హాట్ ఫొటో షూట్‌లతో అభిమానులను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తుంది. అంతే కాకుండా హెల్త్‌కు సంబంధించిన టిప్స్ కూడా ఫ్యాన్స్‌తో పంచుకుంటోంది ఈ బ్యూటీ. ఈ క్రమంలోనే తాజాగా హెల్త్‌కు సంబంధించిన ఓ వీడియో షేర్ చేసింది. కానీ, ఓ నెటిజన్ మాత్రం ఈ వీడియోకు వింత ప్రశ్న వేశాడు. అదేంటంటే..
అక్కినేని నాగచైతన్య, సమంత ప్రేమించి పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే ఏడేళ్లు ప్రేమించుకున్న ఈ జంట అంగరంగ వైభవంగా ఇద్దరూ ఫ్యామిలీస్, ఫ్రెండ్స్ మధ్యలో రెండు మతాలకు సంబంధించిన ఆచారంలో వివాహం చేసుకున్నారు. కానీ కొన్ని అనివార్య కారణాల చేత విడిపోయి.. అభిమానులకు కోలుకోలేని షాక్ ఇచ్చారు. ఇప్పటికీ వీరి ఇద్దరూ కలిసిపోతే బాగున్ను అని కోరుకునే వాళ్లు కూడా ఉన్నారు. ఈక్రమంలోనే వాళ్లు ఎందుకు విడిపోయారు అనే దానిపై ఇంక రచ్చ నడుస్తూనే ఉంది.
అయితే.. తాజాగా యోగాకు సంబంధించి ఓ వీడియో పోస్ట్ చేసింది సమంత. అందులో తను రోజు చేసే మెడిటేషన్స్ టైమింగ్స్ గురించి చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతుండగా.. అందరూ పాజిటివ్‌గా రిప్లైలు ఇచ్చారు. ఓ నెటిజన్ మాత్రం ‘మీ అమాయకపు భర్తను ఎందుకు మోసం చేశారు’ అని అడిగాడు. దాని స్పందించిన సమంత ‘ఈ ప్రశ్న మీకు మంచిది కాకపోవచ్చు.. మీకు ఇంకా స్ట్రాంగ్ టెక్నిక్స్ కావాలి.. మీరు బాగుండాలని కోరుకుంటున్నా’ అంటూ స్ట్రాంగ్ రిప్లై ఇచ్చింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన చాట్ నెట్టింట వైరల్ అవుతోంది.